Monalisa: ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే వెబ్ మీడియా వరకు ఆమె చుట్టూ తిరిగింది. దాదాపు పది రోజులపాటు ఆమె దేశవ్యాప్తంగా సెర్చింగ్ పర్సనాలిటీ గా మారిపోయింది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయింది. దీంతో సినిమా ఆఫర్లు ఆమెను తట్టాయి. ఇటీవల కేరళలో ఒక జువెలరీ షాప్ ప్రారంభానికి కూడా ఆమె వెళ్ళింది.. త్వరలో జరిగే శివరాత్రి వేడుకలకు నేపాల్ కూడా వెళ్తోంది. ఇప్పటికే ఆమెకు నిర్వాహకులు ఆహ్వానాన్ని పంపించారు. పేద కుటుంబానికి చెందిన మోనాలిసా ఇంతటి గుర్తింపు సాధించుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఆఫర్లు కూడా రావడంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలయితే మోనాలిసా కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుందని వార్తలు రాయడం మొదలుపెట్టాయి. అయితే మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఇప్పుడు మోనాలిసా కెరియర్ ప్రమాదంలో పడింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే మోనాలిసా కెరియర్ ఎందుకు ప్రమాదంలో పడిందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాకపోతే జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కొన్ని కథనాలు దానికి అవును అనే సమాధానం చెబుతున్నాయి.
ది డైరీ ఆఫ్ మణిపూర్
మోనాలిసా కుంభమేళా ద్వారా సెలబ్రిటీ అయిపోయారు. ఆమె ప్రస్తుతం ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి సనోజ్ మిశ్రా అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు. జితేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.. అయితే సనోజ్ ఒక తాగుబోతు అని.. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలను ముంబై తీసుకెళ్తాడని.. ఆ తర్వాత అనుచితంగా ప్రవర్తిస్తాడని.. ఇంతవరకు అతడు దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని.. మోనాలిసా కు వచ్చిన ఫేమ్ ను అతడు వాడుకుంటున్నాడని జితేంద్ర ఆరోపించాడు. జితేంద్ర చేసిన ఆరోపణలను సనోజ్ మిశ్రా ఖండించాడు..” మోనాలిసా కు ఒక్కసారిగా ఫేం వచ్చింది. ఆమె దేశవ్యాప్త సెలబ్రిటీ అయిపోయింది. దీంతో సినిమా అవకాశాలు ఇస్తానని సనోజ్ ఆమెను సంప్రదించాడు. ఆమేది పేద కుటుంబం కావడం.. హీరోయిన్ అయ్యేందుకు అవకాశం ఉండడంతో ఒప్పుకుంది. కానీ ఇంతలోనే ఆమె నటించిన సినిమాకు అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇవి త్వరలోనే తీరిపోతాయి? లేక అంతకంతకు పెరుగుతాయా అనేది చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం మోనాలిసా ఫేమ్ ను సనోజ్ మిశ్రా వాడుకుంటున్నాడు. అయితే ఈ చక్రబంధం నుంచి ఆమె ఎలా బయటపడుతుంది.. ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటుందనేది వేచి చూడాలని” సినిమా విశ్లేషకులు పేర్కొంటున్నారు.