Varun Dhawan – Sania Meerza : సానియా మీర్జా అంటే పిచ్చి నాకు.. ఆరోజు అడగ్గానే ఇచ్చేసా.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

Varun Dhawan Sania Meerza : బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సినిమాల్లోకి రాకముందు ఒక ప్రొడక్షన్ కంపెనీలో మామూలు ఉద్యోగిగా పనిచేసేవాడు. కానీ కష్టపడి ఎదిగి ఇండస్ట్రీలో ఇప్పుడు తనేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘తోడేలు’ అనే డిఫెరెంట్ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రేపు ‘తోడేలు’ మూవీ బాలీవుడ్ తోపాటు దక్షిణాది భాషలన్నింటిలో ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. వరుణ్ ధావన్, కృతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో అగ్ర […]

Written By: NARESH, Updated On : November 24, 2022 8:07 pm
Follow us on

Varun Dhawan Sania Meerza : బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సినిమాల్లోకి రాకముందు ఒక ప్రొడక్షన్ కంపెనీలో మామూలు ఉద్యోగిగా పనిచేసేవాడు. కానీ కష్టపడి ఎదిగి ఇండస్ట్రీలో ఇప్పుడు తనేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘తోడేలు’ అనే డిఫెరెంట్ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.

రేపు ‘తోడేలు’ మూవీ బాలీవుడ్ తోపాటు దక్షిణాది భాషలన్నింటిలో ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. వరుణ్ ధావన్, కృతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. రేపు విడుదలవుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ధావన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పి వరుణ్ ధావన్ అందరినీ షాకిచ్చాడు. తనకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. సానియాపై తనకు బాగా క్రష్ ఉండేదని.. ఆమె అందం, చందం చూసి ఆమె అంటే చాలా ఇష్టం కలిగిందని.. ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకునేవాడినని వరుణ్ ధావన్ వెల్లడించాడు.

‘అప్పట్లో నేను ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సానియా యాడ్ చేసేందుకు అక్కడికి వచ్చారు. ఆమె తనకు ఆపిల్ కావాలని అడిగితే వెళ్లి తెచ్చిచ్చాను. అది చూసి సానియా తల్లి నన్ను ఎందుకు తెచ్చావ్ అంటూ గద్దించింది. దీంతో సానియా తానే తెమ్మన్నానని చెప్పడంతో ఆరోజు బతికిపోయా’ అని వరుణ్ ధావన్ తన తొలి చూపును బయటపెట్టాడు. అప్పటి నుంచే తనకు సానియా అంటే క్రష్ ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.