
Sania Mirza Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూర్చారు.. ఇందుకు సంబంధించి ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన సందేశం ఆజ్యం పోసినట్టు అయింది. భర్త షోయబ్ మాలిక్ తో విడిపోతున్నారనే పుకార్ల మధ్య టెన్నిస్ స్టార్ సానియా సోషల్ మీడియాలో క్రిప్టిక్ సందేశాన్ని పోస్ట్ చేశారు.
సానియా మీర్జా ప్రస్తుతం తన కుమారుడితో దుబాయ్ లో ఉంటున్నారు. గత కొద్ది నెలలుగా షోయబ్ మాలిక్ తో విడిగా ఉంటున్నారు. షోయబ్ మాలిక్ పాకిస్తాన్లో ఉంటున్నారు. అయితే గతంలో సోయబ్ మాలిక్ ఒక ప్రకటన షూటింగ్ నిమిత్తం పాకిస్తాన్ నటితో నటించాల్సి వచ్చింది. స్వతహాగా ఆమె మోడల్ కావడంతో… షోయబ్ మాలిక్ డేటింగ్ కు వెళ్లాడని సమాచారం. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సానియా మీర్జా కంట పడటంతో అప్పటినుంచి ఆమె అతడికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. గతంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు పుకార్లు చెలరేగాయి.. తర్వాత ఎందుకో చప్పబడ్డాయి.. అయితే ఆ మధ్య సానియా మీర్జా తన కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు షోయబ్ మాలిక్ హాజరయ్యారు. కానీ ఈ వేడుకకు సంబంధించి షోయబ్ మాలిక్ లేని ఫోటోలను మాత్రమే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీన్నిబట్టి ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ కొనసాగుతోంది అని అందరికీ అర్థమైంది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారని రూడీ అయింది.

సానియా మీర్జా గత నెలలో తన చివరి గ్రాండ్ స్లాం మ్యాచ్ ఆడారు. తన భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్డ్ డబుల్ ఫైనల్ చేరుకున్నారు. సానియా మీర్జా తన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఇది విశ్వాసం కోల్పోయే సమయం కాదు.. విశ్వాసాన్ని పట్టుకునే సమయం అని పేర్కొన్నారు. సానియా మీర్జా, ఆమె అమెరికన్ భాగస్వామి బెథాని మాటెక్_ సాండ్స్ అబుదాబి ఓపెన్ మొదటి రౌండులో కిర్ స్టెన్ ఫ్లిప్ కెన్స్, లాగా సీగేమండ్ జోడీ పై వరుస సెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.