Pawan Kalyan Unstoppable: ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చరిత్రలో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పి ఆహా యాప్ ని ఇండియాలోనే టాప్ 3 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్పిన ఎపిసోడ్ ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం అనే చెప్పాలి.ఫిబ్రవరి 2వ తారీఖున స్ట్రీమింగ్ అయినా ఈ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి వ్యూస్, అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, పవన్ కళ్యాణ్ – బాలయ్య కలిస్తే వచ్చే మాస్ మసాలా మిస్ అయ్యిందనే అనుభూతి అభిమానుల్లో ప్రేక్షకుల్లో కలిగింది.

అయితే మొన్న విడుదల చేసిన మొదటి ఎపిసోడ్ కేవలం టీజర్ లాంటిది మాత్రమేనని, అసలు సినిమా ఈరోజు అప్లోడ్ చెయ్యబోతున్న రెండవ భాగం లో ఉండబోతుందని, ఆహా టీం ఈ సందర్భంగా తెలిపింది.దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ‘హరి హర వీరమల్లు’ డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నది మనం ప్రోమో లో చూడవచ్చు..కానీ ఎపిసోడ్ లో ఇంకా చాలా సర్ప్రైజ్ లు ఉంటాయని అంటున్నారు..పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడడం ఒక విశేషం అయితే, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎపిసోడ్ చివర్లో పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి వెళ్లడం మరో హైలైట్ గా నిలవబోతుందట.

మోక్షజ్ఞ తేజ ఇలాంటి షోస్ లో పాల్గొనడం ఇదే తొలిసారి, ఆయన మీడియా కి కనిపించేదే చాలా తక్కువ..అలాంటిది ఏకంగా ఇంత పెద్ద టాక్ షో లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు.ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో రేపు ప్రసాద్ లాబ్స్ లో వెయ్యబోతున్నారట, మొదటి భాగం కి కూడా ఇలాగే స్పెషల్ స్క్రీనింగ్ వేశారు, రెస్పాన్స్ అదిరిపోయింది, మరి సెకండ్ ఎపిసోడ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.