
Siri- Shanmukh Relationship: బిగ్ బాస్ సీజన్ 5 లో యూట్యూబ్ సెలబ్రిటీస్ గా షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి అడుగుపెట్టి వాళ్లిద్దరూ హౌస్ లో చేసుకున్న రొమాన్స్ యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఎంతలా షాక్ కి గురి చేసిందో మన అందరికీ తెలిసిందే.ఎందుకంటే షణ్ముఖ్ కి అప్పటికే దీప్తి సునైనా తో లవ్ ఉంది..వీళ్లిద్దరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, మరో పక్క సిరి కి కూడా శ్రీహాన్ తో నిశ్చితార్థం అయ్యింది.
అలాంటిది వీళ్లిద్దరు కలిసి అలా రొమాన్స్ చేసుకోవడం,ఒకరిని వదిలి ఒకరు ఉండలేని రేంజ్ లో ప్రవర్తించడం ప్రతీ ఒక్కర్ని నోరెళ్లబెట్టేలా చేసింది.సిరి వాళ్ళ అమ్మ హౌస్ లోపాలకి వచ్చినప్పుడు ‘మా అమ్మాయికి దూరం గా ఉండు’ అని మొహం మీదనే చెప్పేయడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది..ఇక హౌస్ నుండి బయటకి రాగానే దీప్తి సునైనా షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది.
వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అంతటి ప్రకంపనలు రేపాయి..ఇదంతా పక్కన పెడితే ఈ ఆదివారం స్టార్ మా ఛానల్ లో లవ్ టుడే అనే స్పెషల్ ప్రోగ్రాం జరగనుంది, ఈ ప్రోగ్రాం కి సెలెబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రేమ జంటలన్నీ హాజరయ్యాయి.వారిలో సిరి – శ్రీహాన్ జంట కూడా ఉంది..ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ గతం లో తాను బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ తో చేసిన రొమాన్స్ గురించి మాట్లాడుతూ శ్రీహాన్ కి ఏడుస్తూ క్షమాపణలు చెప్పడం ఈ ప్రోమో లో హైలైట్ గా నిలిచింది.

‘చిన్న చిన్న తప్పులను ఎవరైనా చేస్తారు..కానీ ధైర్యం గా స్టేజి మీద చెప్పుకునే దమ్ము ఉండాలి..అది నాకు ఉంది, నేను కూడా శ్రీహాన్ ని బాధపెట్టేలా ఒక తప్పు చేశాను’ అంటూ బిగ్ బాస్ హౌస్ లో తాను చేసిన తప్పు గురించి చెప్పుకొని ఏడ్చేసింది, ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.