Homeట్రెండింగ్ న్యూస్Sania Mirza : కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సానియా మీర్జా.. ఈసారి ఏ తీరం చేరుతుందో?

Sania Mirza : కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సానియా మీర్జా.. ఈసారి ఏ తీరం చేరుతుందో?

Sania Mirza : ఇన్నాళ్లు ఒకలా.. ఇప్పటి నుంచి ఒకలా.. అంటుంది టెన్నీస్ క్రీడాకారిని సానియా మిర్జా. ఇక కొత్త ప్రయాణం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. చిన్నారుల ఫిట్‌నెస్, స్టడీ, మానసిక, శారీరక ఎదుగుదల కోసం ఏడాది క్రితం జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ‘సీసా స్పేసెస్’ నిర్వహించిన కార్యక్రమంలో సానియా పాల్గొంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి కూడా పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెం.10లో సీసా చిన్నారుల ఆనందం, ఎదుగుదలను సమతుల్యం చేసేందుకు రూపొందించిన అద్భుత ప్రదేశం. సీసా మూడు ప్రధాన స్తంభాలపై నిర్మించబడింది (ఫ్యామిలీ కేఫ్, క్రియేటివ్ ప్లే జోన్లు, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లు దీనిని పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఒక రకమైన గమ్యస్థానంగా మార్చారు. వాటితో పాటు ఈ సంస్థ బర్త్ డే వేడుకలు, మీడియా రూమ్ అనుభవాలు లాంటి వాటిని కూడా అందిస్తుంది.
‘ఒక క్రీడాకారిణిగా, తల్లిగా పిల్లలు ఉత్తమ వ్యక్తులుగా ఎదగగలిగే వాతావరణాన్ని సృష్టించడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు’ అని సానియా అన్నారు. ‘స్వాతితో మాట్లాడిన సమయంలో సీసా గురించి చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుంది. పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా సీసా విలువైనదని నా అభిప్రాయం అన్నారు.

స్వాతి గునుపాటి మాట్లాడుతూ.. సీసా వ్యవస్థాపకురాలు, మాట్రిక్ ఫార్మా కార్పొరేషన్ చీఫ్ కార్పొరేట్ ఆఫీసర్ స్వాతి గునుపాటి నాయకత్వం, ఆవిష్కరణలలో బలమైన పునాది కలిగి ఉన్న నిష్ణాతుడైన వ్యాపారవేత్త. ముద్రా వెంచర్స్, ముద్ర మీడియా వర్క్స్, అనేక ఇతర వెంచర్ల వెనుక స్వాతి కూడా ఉంది. నా స్నేహితురాలు సానియా మీర్జాతో కలిసి సురక్షితమైన, స్ఫూర్తి దాయకమైన వాతావరణాన్ని సృష్టించడమే మా లక్ష్యం. పిల్లలు వారి పోషణలో తల్లిదండ్రుల పాత్రపై సీసా అమూల్యమైన సమయం కేటాయిస్తుందన్నారు.

సీసా కో ఫౌండర్ శ్రీజ కొణిదెల మాట్లాడుతూ పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిపై స్వాతి సింగపూర్‌లోని న్యూకాజిల్ యూనివర్సిటీ నుంచి బీబీఏ, లండన్‌లోని కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందిందని చెప్పారు. ఇద్దరు పిల్లల తల్లిగా పిల్లలకు ఏం కావాలో.. వారి తల్లిదండ్రులకు ఏం కావాలో.. అందుకు తగ్గట్లుగా సీసాను తీర్చిదిద్దామన్నారు. ఇది ఆట స్థలం మాత్రమే కాదు.. సంపూర్ణ ఎదుగుదల ప్రదేశంగా రూపొందించామని చెప్పారు. పిల్లలు ఆడుకునేందుకు అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నాం అన్నారు.

Sania Mirza
Sania Mirza
Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular