Ambati Rambabu : అంబటి రాంబాబు ( ambati Rambabu).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా.. గత పదేళ్లలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. 2019లో వైసీపీ తరఫున గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ మంత్రివర్గంలో( Jagan cabinet) పనిచేశారు. అయితే ఆయన ఉన్నట్టుండి వకీల్ సబ్ గా దర్శనం ఇచ్చారు. నల్లటి దుస్తులతో హైకోర్టు ప్రాంగణంలో కనిపించారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు. తనతో పాటు మాజీ సీఎం జగన్ ( EX CM Jagan) కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణకు రావడంతో ఇన్ పర్సన్ గా తనకు తానే వాదనలు వినిపించేందుకు ముందుకు వచ్చారు. దీంతో అప్పటివరకు అంబటి రాంబాబు( ambati Rambabu) న్యాయవాది అని పెద్దగా ఎవరికి తెలియదు. కాగా ఈ కేసులో తన వాదనలు హైకోర్టులో వినిపించగా కోర్టు నాలుగు వారాలపాటు విచారణను వాయిదా వేసింది. అయితే అంబటి రాంబాబులో ఈ యాంగిల్ కూడా ఉందా? ఆయన నిజంగానే లాయరా? అని ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు.
* వైసీపీ కీలక నేతల్లో ఒకరు
వైసీపీ కీలక నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. గుంటూరు జిల్లా (Guntur district) రేపల్లె ఆయన స్వగ్రామం. విశాఖలోని న్యాయవిద్య పరిషత్ లా కాలేజీ నుంచి బిఎల్ పూర్తి చేశారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1988 లోనే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ ( legal cell convener) గా పనిచేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నుంచి గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. పీఏసీ కమిటీ సభ్యుడు ( public accounts committee member) కూడా అయ్యారు. అటు తరువాత వరుసగా రెండుసార్లు రేపల్లె నుంచి పోటీ చేసినా ఓటమి పలకరించింది. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కింది.
* వైసిపి ఆవిర్భావంతో
వైసీపీ ( YSR Congress) ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు అంబటి రాంబాబు. 2011 మార్చిలో వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 2014లో వైసిపి అభ్యర్థిగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో మాత్రం తిరిగి గెలిచారు. మంత్రి అయ్యారు. వైసీపీలో బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. వైసిపి అధికార ప్రతినిధిగా( official spoke man) నియమితులయ్యారు. ఇప్పుడు ఏకంగా జగన్ తో పాటు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వకీల్ సబ్ గా మారారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ambati rambabu argues in a case of investigation into social media campaign against former cm jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com