
మరికొన్ని రోజుల్లో దేశంలోని హిందువులకు ప్రధాన పండుగలైన దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. దీంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్లతో ఫెస్టివల్ సేల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా వినియోగదారులకు పండుగ సంబరాలను రెట్టింపు చేసేందుకు సాంసంగ్ బంపర్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. టీవీ కొనుగోలు చేస్తే ఉచితంగా స్మార్ట్ ఫోన్ ను ఇవ్వనుంది.
శాంసంగ్ పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్ సంస్థ ప్రతినిధులు పండుగ ఆఫర్లలో భాగంగా తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులను అందిస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఎక్స్‌క్లూజివ్ డీల్స్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈఎంఐలు 990 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయని, వినియోగదారులు తమ ఉత్పత్తులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా పొందవచ్చని గరిష్టంగా 20,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని సంస్థ వెల్లడించింది. సాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీలను, యూహెచ్‌డీ మరియు స్మార్ట్ టీవీలను, అన్ని రకాల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, వాషర్ డ్రయర్లను, స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.
క్యూఎల్ఈడీ 8కే టీవీలలో 85 లేదా 82 లేదా 75 ఇంచుల టీవీలను కొనుగోలు చేస్తే లక్షన్నర రూపాయల విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఫ్రీగా ఇస్తామని, క్యూఎల్ఈడీ ఫోన్లు కొంటే గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఇస్తామని, ఇతర టీవీలకు కూడా ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. క్యూఎల్ఈడీ టీవీలకు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీని కంపెనీ అందిస్తోంది. పండుగ సమయంలో వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఈ ఆఫర్ బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.