కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ నిన్న రాత్రి కన్నుమూశారు. అయన కుమారుడు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ తెలిపారు. దీంతో అయన అభిమానులు అంత కూడా ఈ విషయాన్నీ తెలుసుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.
జన నేతగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ విలాస్ పాశ్వాన్ గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకగా ఉన్నారు. తన మాటే వేదం అని పేదలకు సహాయంగా ఉన్న ఆయన బిహార్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. దాదాపు ఎనిమిది సార్లు రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అయన ఆరు వారాల క్రితం ఢిల్లీలోని ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు.
నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో ఉన్న అయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గుండెకు సంబంధిన శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినప్పటికీ గత ఐదు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇక మరో రోజులో కోలుకోనున్నారు అనే సమయంలో అయన కన్ను మూసి అందరిని శోకసంద్రంలోకి వదిలి వెళ్లారు. కాగా రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.