
Samantha: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల లవ్ ఎఫైర్ వార్తలు పరిశ్రమను ఊపేస్తున్నాయి. కొన్ని నెలలుగా వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. మొదట్లో పుకారుగా ఉన్న ఈ వార్త కొన్ని ఆధారాలతో బలపడింది. రహస్యంగా నాగ చైతన్య-శోభిత విదేశాల్లో చక్కర్లు కొడుతున్నట్లు స్పష్టత వచ్చింది. వీరిద్దరూ లండన్ లోని ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అనూహ్యంగా ఆ ఫోటో లీకైంది. గతంలో శోభితతో ఎఫైర్ రూమర్స్ ని నాగ చైతన్య టీమ్ ఖండించారు. అవన్నీ పుకార్లే అంటూ సమర్ధించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటో మీద వివరణ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే నాగ చైతన్య ఎఫైర్ గురించి సమంత మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె పేర్లు ఎత్తకుండా సంచలన కామెంట్స్ చేశారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎవరు ఎవరితో డేటింగ్ చేసినా నాకు సంబంధం లేదు. మనసు లేని వాళ్లతో బంధం ఏర్పరుచుకుంటే కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటే చాలు. ఇకనైనా తాను మారాలని కొట్టుకుంటున్నాను.. అని సమంత చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.
అదే సమయంలో తన జీవితంలో కొన్నాళ్లుగా చీకటి రోజులు అనుభవించానని, ఆ ఆలోచనలు నన్ను దహించి వేశాయని, అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా అని వెల్లడించారట. సమంత మాటలు చూస్తే నాగ చైతన్య తప్పు చేశాడు. అందుకే నేను విడిపోయానని చెబుతున్నట్లుగా ఉంది. అయితే నాగ చైతన్య ఎఫైర్ రూమర్స్ మీద తాను స్పందించినట్లు వస్తున్న వార్తలను సమంత ఖండించారు. అందులో నిజం లేదని ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు సమంత ట్వీట్ చేశారు.

సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. విడుదలకు రెండు వారాల సమయం మాత్రమే ఉండగా… సమంత శాకుంతలం చిత్రం ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మాత.
I never said this!! https://t.co/z3k2sTDqu7
— Samantha (@Samanthaprabhu2) April 4, 2023