https://oktelugu.com/

Dasara Movie: దసరా’ను మిస్ చేసుకున్న స్టార్ హీరో..

Dasara Movie: తెలుగు రాష్ట్రాల్లో ‘దసరా’ హవా సాగుతోంది. ఏ నోట విన్న దసరా ముచ్చట్లే. ఏ పాట విన్నా దసరా సినిమాలోనిదే.  స్వల్ప అంచనాలతో రిలీజైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం చూసి చిత్రం యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. నాని, కీర్తి సురేష్ ల నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టావ్ అని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. అయితే ఏ సినిమా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 4, 2023 / 12:37 PM IST
    Follow us on

    Dasara Movie

    Dasara Movie: తెలుగు రాష్ట్రాల్లో ‘దసరా’ హవా సాగుతోంది. ఏ నోట విన్న దసరా ముచ్చట్లే. ఏ పాట విన్నా దసరా సినిమాలోనిదే.  స్వల్ప అంచనాలతో రిలీజైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం చూసి చిత్రం యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. నాని, కీర్తి సురేష్ ల నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టావ్ అని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. అయితే ఏ సినిమా అయినా ఇద్దరు, ముగ్గురు హీరోల మీదుగా సెట్ పైకి వస్తుంది. అంటే సినిమా తీయాలని ఓ హీరోతో డిసైడ్ అయితే మరో హీరో రంగ ప్రవేశం చేస్తారు. అలా ‘దసరా’ మూవీని కూడా ముందుగా ఓ స్టార్ హీరోతో అనుకున్నారట.  కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో నాని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనను అంతా మంచి మూవీ మిస్ చేసుకున్నారు బ్రో.. అని కామెంట్ పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు?

    ‘దసరా’ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఏ హీరో అయినా తనకు అవకాశం వస్తే బాగుండు అని అనుకుంటారు. అయితే సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ కథను రచించిన తరువాత మొదట్లో రాంచరణ్ తో తీయాలని అనుకున్నాడట.
    జరంగస్థలంలో రాం నటనను చూసిన ఆయన అదే మాస్ లెవల్లో ఈ కథ ను రచించారట.  అయితే కథ పూర్తయిన తరువాత పెద్ద హీరో కదా.. ఆయనను ఎలా మెప్పించాలో తెలియక డైరెక్టర్ రాం దగ్గరికి వెళ్లలేదట.

    Dasara Movie

    ఆ తరువాత తెలంగాణ నేపథ్యం బాగా ఉన్న ఈ సినిమాను ఈ ప్రాంత హీరోతో తీయాలని అనుకున్నాడట.  దీంతో శ్రీకాంత్ ఓదెల నేరుగా నితిన్ ను కలిశాడట. నితిన్ కు కథ మొత్తం చెప్పినా.. కొత్త డైరెక్టర్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందోనని రిజెక్ట్ చేశాడట. దీంతో ఈయన నానిని సంప్రదించగా ఏమాత్రం ఆలోచించకుండా ప్రోమో రెడీ చేసుకొని తీసుకురమ్మన్నారట. అది చూడగానే నాని వెంటనే సినిమాకు సైన్ చేశాడు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

    ఒక దశలో ఈ సినిమాలో నాని తప్ప మరే హీరో షూట్ కారన్న ప్రచారం సాగుతోంది.  అంతేకాకుండా నాని కెరీర్లోనే ఇది బిగ్గెస్టు మూవీగా పేర్కొంటున్నారు. అయితే మంచి సినిమాను మిస్ చేసుకున్నవ్ బ్రో.. అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టడం ఆసక్తిగా మారింది.  ఇదిలా ఉండగా ‘దసరా’ యూఎస్ లో మిలియన్ మార్క్ ను దాటేసింది.  నైజాంలో ఫస్ట్ డేనే రికార్డు సృష్టించింది.