
Samantha: సమంత కెరీర్లో ఎన్నడూ ఊహించని పరాజయం ఇది. పన్నెండేళ్ల జర్నీలో సమంత ఇంత పెద్ద డిజాస్టర్ చూళ్ళేదు. శాకుంతలం థియేటర్స్ సాయంత్రానికే ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలో భారీగా నష్టాలు వచ్చాయి. నిర్మాత దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయారని టాలీవుడ్ టాక్. శాకుంతలం బడ్జెట్ దాదాపు రూ. 60 కోట్లు. దిల్ రాజు స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినట్లు సమాచారం. కనీసం మూడు కోట్ల షేర్ రాలేదు. డిజిటల్ రైట్స్ ద్వారా కొంత మేర సేవ్ అయ్యారు. రూ. 25 కోట్లకు శాకుంతలం ఓటీటీ హక్కులు అమ్ముకున్నట్లు తెలుస్తుంది.
శాటిలైట్ రైట్స్ కి దిల్ రాజు రూ. 15 కోట్లు డిమాండ్ చేశారట. దాంతో ఎవరూ కొనలేదు. ఇప్పుడు చాలా తక్కువ మొత్తానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎలా చూసినా శాకుంతలం నిర్మాతలకు రూ. 25-30 కోట్ల నష్టం కనిపిస్తుంది. ఈ క్రమంలో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారట. సమంత సినిమాకు రూ. 4-6 కోట్లు తీసుకుంటుంది. శాకుంతలం ఆమె లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ. కాబట్టి రెమ్యూనరేషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నెలల తరబడి కష్టపడి అంత డబ్బు వదులుకోవడం అంటే సాధారణ విషయం కాదు.
అయితే సమంత మొత్తం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిందా? లేక కొంత మొత్తం ఇచ్చిందా? అనేది తెలియదు. అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత లండన్ లో ఉన్నారు. ఆమె సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షోకి హాజరయ్యారు. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. దీంతో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ టీం అయిన సమంత, వరుణ్ ధావన్, రాజ్ అండ్ డీకే లకు ఆహ్వానం లభించింది.

సిటాడెల్ షూటింగ్ సమంత కొంత మేర పూర్తి చేసింది. రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయినట్లు సమాచారం. మెజారిటీ షూటింగ్ విదేశాల్లో జరగనుందట. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో చిత్రీకరించనున్నారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది.