
Samantha – Naga Chaitanya: నాగ చైతన్య-సమంత విడిపోవడం ఊహించని పరిణామం. అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. సామ్,చైతూ మరలా కలిసిపోతే బాగుండని కోరుకున్నారు. ఈ సంఘటన నాగ చైతన్యపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలియదు. ఎందుకంటే ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాల మీద స్పందించరు. తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో మాత్రమే పాల్గొంటారు. విడాకుల ప్రకటన తర్వాత నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదలైంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో కూడా చైతన్య డివోర్స్ పై కామెంట్ చేయలేదు.
సమంత మాత్రం వేదన అనుభవించారనేది నిజం. డిప్రెషన్ కి గురైన సమంత. స్నేహితుల సహాయం తీసుకున్నారు. చైతూ జ్ఞాపకాల నుండి బయటపడేందుకు వరుసగా టూర్స్ కి వెళ్లారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించారు. ఓ ఏడాది పాటు ఆమె మానసిక సంఘర్షణకు గురయ్యారు. అదే సమయంలో నాగ చైతన్య మీద అసహనం, కోపం పరోక్షంగా బయటపెట్టేవారు. లోతైన అర్థాలతో కూడిన కామెంట్స్ పోస్ట్ చేస్తుండేవారు.
ప్రేమ ఉన్నప్పుడే కోపం వస్తుంది. ఒక వ్యక్తిపై ప్రేమ అనే ఫీలింగ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేసినా మనం పట్టించుకోము. ప్రతిసారి నాగ చైతన్య మీద సమంత అసహనం కనబరచడానికి ప్రేమే కారణం కావచ్చు. చైతూని సమంత ఇంకా మరచిపోలేదన్న వాదన కూడా ఉంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ అందుకు నిదర్శనమని చెప్పాలి. ఏప్రిల్ 5 మజిలీ చిత్ర విడుదల తేదీ కాగా… దర్శకుడు శివ నిర్వాణకు కృతజ్ఞతలు తెలుపుతూ సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

మజిలీ చిత్రంలో తాను పోషించిన శ్రావణి పాత్ర చాలా ప్రత్యేకమని కామెంట్ పెట్టారు. మజిలీ చిత్రంలో నాగ చైతన్య హీరో అన్న విషయం తెలిసిందే. సమంత-నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం కూడా అదే. నాగ చైతన్య హీరో అని తెలిసి కూడా మజిలీ చిత్రాన్ని గుర్తు చేసుకున్న సమంత తన ప్రేమను వ్యక్తం చేశారనే వాదన వినిపిస్తోంది. మజిలీ మూవీలో హీరోని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా సమంత నటించారు. 2019లో విడుదలైన మజిలీ సూపర్ హిట్ గా నిలిచింది.