
Ram Charan On Bollywood: #RRR సినిమాతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీళిద్దరితో సినిమాలు చేసేందుకు ప్రతీ ఇండస్ట్రీ లోని క్రేజ్ స్టార్ డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ లో హ్రితిక్ రోషన్ పాటు కలిసి నటించే ఛాన్స్ దక్కింది.
ఈ సినిమాకి బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ సంగతి ఓకే, మరి రామ్ చరణ్ పరిస్థితి ఏమిటి..?, బాలీవుడ్ లో ఆయనకీ ఎలాంటి ఆఫర్ రాలేదా వంటి సందేహాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ తో బాలీవుడ్ కి రాజమౌళి లాంటి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఒక సినిమా చేయబోతున్నాడట.

#RRR మూవీ కి ముందే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయ్యినట్టు సమాచారం,అయితే ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ తో డుంకీ అనే సినిమా చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం తర్వాతే రామ్ చరణ్ తో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్ మొదలవ్వబోతుందని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.
రాజ్ కుమార్ హిరానీ ఇప్పటి వరకు బాలీవుడ్ లో మున్నాభాయ్ MBBS , లగేరహో మున్నాభాయ్ ,3 ఇడియట్స్, పీకే , సంజు ఇలా ఎన్నో సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించాడు. ప్రతీ చిత్రం ఒకదానిని మించి ఒకటి సెన్సేషన్ సృష్టించాయి.అలాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చెయ్యబోతుండడం నిజంగా చరణ్ అదృష్టం అని అభిమానులు గర్వపడుతున్నారు. ఈ చిత్రం తో పాటుగా సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా ఫిక్స్ చేసాడట చరణ్, అలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో రామ్ చరణ్ బాలీవుడ్ ని ఎలేసే ప్రయత్నం చేస్తునట్టు తెలుస్తుంది.