
Samantha: సమంత ఫిట్నెస్ ఫ్రీక్. వ్యాయామం, యోగా ఆమె దిన చర్యలో భాగం. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంది. కొన్నాళ్లుగా సమంత జీరో సైజ్ మైంటైన్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ 2లో ఆమె చేసిన పాత్రకు ఫిట్నెస్ బాగా ఉపయోగపడింది. శ్రీలంక రెబల్ పాత్రలో సహజం కనిపించేలా చేసింది. ఆ మధ్య సమంత మయోసైటిస్ బారినపడ్డారు. చికిత్స తీసుకున్న సమంత కేవలం ఒకటి రెండు నెలలు మాత్రమే వ్యాయామం ఆపేసినట్లు సమాచారం. పూర్తిగా కోలుకోకుండానే జిమ్ లో ప్రత్యక్షమయ్యారు.

ప్రస్తుతం సమంత మరో యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ చేస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న సిటాడెల్ లో సమంత పాత్ర హాలీవుడ్ హీరోయిన్స్ ని తలపించనుంది. ఆమె దుమ్మురేపే పోరాట సన్నివేశాల్లో అలరించనున్నారట. సిటాడెల్ కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నారు. సమంత కొన్ని యుద్ధ విద్యలు కూడా అభ్యసించినట్లు సమాచారం. ఇక జీరో సైజ్ ప్యాక్ కోల్పోకుండా ఉండేందుకు వ్యాయామాలు చేస్తుంది. జిమ్ ఫిట్లో కఠినమైన ప్లాంక్స్ చేస్తున్న ఫోటో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి కామెంట్ సెక్షన్ లో లవ్ సింబల్ జోడించారు.

వ్యాయామం ఎంతగానో ఇష్టపడతానని ఆమె చెప్పకనే చెప్పారు. జిమ్ ఫిట్ లో సమంత అర్ధనగ్నంగా అనిపించారు. ఇక నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నావా..? అని ప్రశ్నిస్తున్నారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక సమంత సిటాడెల్, ఖుషి చిత్ర షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.
ఇక సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పౌరాణిక చిత్రంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. రెండు సార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. సమంతకు జంటగా మలయాళ దేవ్ మోహన్ నటించారు. విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక రోల్ చేశారు. మణిశర్మ సంగీతం అందించారు. శాకుంతలం చిత్రం ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటున్నారు.
View this post on Instagram