
Niharika Konidela: మెగా డాటర్ నిహారికపై ఓ వర్గం మీడియా కుట్ర పన్నుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఎక్కడేం జరిగినా మెగా ఫ్యామిలీని దూషించేందుకు ఓ వర్గం సిద్ధంగా ఉంటుంది. వారికి సంబంధం లేని విషయాల్లోకి కూడా లాగి పరువు తీయాలనే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వ్యక్తిత్వం దెబ్బతీసే సోషల్ మీడియా పోస్ట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆమె విడాకులు తీసుకోబోతున్నారంటూ ఒక మీడియా సంస్థ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది.
దాని ప్రకారం… భర్త వెంకట్ చైతన్యతో నిహారికకు విభేదాలు తలెత్తాయి. వారు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు. నిహారిక-వెంకట చైతన్య మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో విడాకులు తీసుకునే అవకాశం కలదంటూ జోష్యం చెప్పారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ మెగా అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. మెగా ఫ్యామిలీని దెబ్బతీసేందుకు నిహారికను టార్గెట్ చేస్తున్నారని వాపోతున్నారు. సదరు మీడియా సంస్థ మీద మండిపడుతున్నారు. అయినా ఒకరి వ్యక్తిగత విషయాలతో మీకెందుకని ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా ఇలానే కొన్ని నిరాదరణ ఆరోపణలు నిహారిక మీద చేశారు. నాగబాబును ఇరుకున పెట్టాలనేది వారి ప్రధాన ఉద్దేశం కావచ్చు. అభిమానులను ఈ పుకార్లను ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా 2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ మెగా డాటర్ పెళ్ళికి వేదికైంది. ఐదు రోజులు ఘనంగా నిహారిక-వెంకట చైతన్యల పెళ్లి వేడుకలు నిర్వహించారు. మెగా హీరోలు అందరూ హాజరు కావడంతో ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.

వివాహం అనంతరం కూడా నిహారిక పరిశ్రమను వీడలేదు. అయితే నటిగా ప్రయత్నాలు ఆపేసినట్లు సమాచారం. కానీ నిర్మాతగా కొనసాగుతున్నారు. నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఉంది. అందులో సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఒక మనసు మూవీతో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించారు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరాలో చిన్న పాత్ర చేశారు.
Is trouble brewing between Niharika and Chaitanya ?
Niharika Konidela , her husband Chaitanya Jonnalagadda unfollowed each other on Instagram. Reportedly, he even deleted wedding photos from the profile.
— Telugu360 (@Telugu360) March 19, 2023