Bellamkonda Srinivas: ప్రభాస్ కెరీర్ లోనే మైల్ స్టోన్ లాంటి సినిమా, అలాగే ప్రభాస్ ను టాలీవుడ్ లో రెబల్ స్టార్ ను చేసిన సినిమా ‘ఛత్రపతి’. ఇటు యాక్షన్, అటు ఎమోషన్ లోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమాతోనే ప్రభాస్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి తెగ ఉబలాట పడుతున్నాడు.

పైగా బెల్లంకొండ బాబుకు హిందీలో ఇదే తొలి సినిమా. తెలుగులోనే బెల్లంకొండ బాబుకు మార్కెట్ లేదు. మరి హిందీలో ఇక ఎంతవరకు రాణిస్తాడో ఆయనకే తెలియాలి. ప్రస్తుతానికి అయితే, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సినిమా టైటిల్ విషయంలోనే ఆ సమస్య.
ఈ సినిమాను మొదట ఛత్రపతి అనే పేరుతో హిందీలోకి వదులుదాం అనుకున్నారు. కానీ, ఆ టైటిల్ ని మరెవరో ఇప్పటికే రిజిస్టర్ చేయించుకున్నారు. టైటిల్ అడిగితే ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. సరే పోనిలే.. మనం శివాజీ అని టైటిల్ పెట్టుకుందాం అనుకుంటే.. దాన్ని కూడా ఇప్పటికే రిజిస్టర్ చేయించుకున్నారట.
ఈ సినిమా కథకు పై రెండు టైటిల్స్ బాగా సూట్ అవుతాయి. మరో టైటిల్ కథకు సెట్ అయ్యేలా లేదు. ఇక చేసేది ఏమి లేక, ఛత్రపతి టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న నిర్మాతతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ బేరసారాలు తెగేలా లేవు అట. ఆ టైటిల్ ఇవ్వడానికి సదరు నిర్మాత దాదాపు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
Also Read: Hero Siddarth: అసలు జవాబుదారీతనం ఎక్కడుంది?.. కేంద్రంపై హీరో సిద్ధార్థ్ ఫైర్
అసలుకే బెల్లంకొండ బాబుకు మార్కెట్ లేదు, సినిమాకి పెట్టిన డబ్బులే వెనక్కి వస్తాయో రావో తెలియని పరిస్థితి కనిపిస్తుంటే.. మళ్లీ టైటిల్ కి కూడా రెండు కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాలి ? అందుకే, నిర్మాతలు రెండు కోట్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా లేరు. ఈ సినిమా నిర్మాత సినిమా విషయంలోనే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
అసలుకే కంటెంట్ పాతది. దానికితోడు భారీ యాక్షన్ సీన్స్. ఒక తెలుగు హీరో మీద యాక్షన్ సీక్వెన్స్ ను హిందీ జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు మొదలైపోయాయి. ఈ ఆలోచనలో పాయింట్ ఉంది. హిందీలో మంచి మార్కెట్ ఉన్న హీరోలకే సినిమా ప్లాప్ టాక్ వస్తే కలెక్షన్స్ రావడం లేదు. ఇక తెలుగు హీరోకి ఎందుకు వస్తాయి.
Also Read: Bollywood: చిక్కుల్లో విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ ల పెళ్లి… కేసు నమోదు