
Samantha- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-సమంత కేరళలో చక్కర్లు కొడుతున్నారు. ఈ యంగ్ ఫెలోస్ ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లారు. అయితే ఇదేమి పర్సనల్ ట్రిప్ కాదు. ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా కేరళ వెళ్లారు. అక్కడ విజయ్ దేవరకొండ-సమంతలపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఖుషి మూవీలో కేరళ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఈ కేరళ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అయితే కేరళకు సమంత జీవితానికి గట్టి బంధం ముడిపడి ఉంది. ఆమె మొదటి సినిమా చాలా వరకు కేరళలో తీశారు. ఏమాయ చేశావే మూవీలో సమంత కేరళ క్రిస్టియన్ గా నటించారు. ఏమాయ చేశావే మూవీలో జెస్సీ(సమంత) కేరళలో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళుతుంది. ఆమె కోసం కార్తీక్(నాగ చైతన్య) కేరళ వెళతాడు. అక్కడే జెస్సీ మనసు కార్తీక్ వైపు మళ్లుతుంది. హైదరాబాద్ వచ్చే క్రమంలో రైలులో ఇద్దరి మధ్య రొమాన్స్ చోటు చేసుకుంటుంది. ఏమాయ చేశావే మూవీ కోసం చైతు-సమంత మధ్య అద్భుతమైన సన్నివేశాలు తెరకెక్కించారు.
అది సమంత మొదటి చిత్రం కాగా… నిజంగానే చైతుతో ప్రేమలో పడిపోయింది. ఆమెకు నాగ చైతన్య జ్ఞాపకాలు ఖుషి చిత్ర షూటింగ్ లో వెంటాడడం ఖాయం. ఈ క్రమంలో ఖుషి చిత్ర కేరళ షెడ్యూల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా ఉన్న ఖుషి టైటిల్ ని వాడుకున్నారు. ఇది ఒక రకంగా బాధ్యత కూడా. ఆటోమేటిక్ గా పోలికలు, అంచనాలు ఏర్పడతాయి.

ఖుషితో పాటు సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా సిటాడెల్ తెరకెక్కుతుంది. రాజ్ అండ్ డీకే దర్శకులుగా ఉన్నారు. గతంలో సమంత వీరితో ది ఫ్యామిలీ మాన్ 2 చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ది ఫ్యామిలీ మాన్ 2 భారీ విజయం సాధించింది. అలాగే సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.