Homeఎంటర్టైన్మెంట్Manchu Family: డ్యామేజ్ కంట్రోల్ కోసం మరింత దిగజారిపోయిన మంచు కుటుంబం.. వైరల్ గా మారిన...

Manchu Family: డ్యామేజ్ కంట్రోల్ కోసం మరింత దిగజారిపోయిన మంచు కుటుంబం.. వైరల్ గా మారిన మరో వీడియో

Manchu Family
Manchu Family

Manchu Family: టాలీవుడ్ లో విచితమైన వేషాలు వేసే ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది మంచి ఫ్యామిలీ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సోషల్ ఇండియా వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న చేష్టలు ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా చేస్తున్నాయి. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు పండించిన హాస్యాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

ప్రశాంతం గా ఏకపక్షంగా జరగాల్సిన ఎన్నికలలో మధ్యలో దూరి, గొడవలు చేసి, తింగరి మాటలు మాట్లాడి సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ ఎదురుకున్నాడు. కాస్త అటు ఇటు మాట్లాడితేనే నెటిజెన్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.ఇక మంచు విష్ణు నెటిజెన్స్ కి ట్రోల్ చేసుకునేందుకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఇచ్చాడు, ట్రోల్ చెయ్యకుండా ఎలా ఉంటారు?, అలా ట్రోల్ల్స్ పడినందుకు గాను తనని కావాలని ట్రోల్ చేయిస్తున్నారు, నా కుటుంబం పై మెగా ఫ్యామిలీ హీరోలు పగబట్టారు అని మంచు విష్ణు చెప్పడం అందరికి కామెడీ అనిపించింది.

ఇక రీసెంట్ గా మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య ఒక గొడవ జరిగినట్టు ఇంస్టాగ్రామ్ లో మనోజ్ పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు రోడ్డు మీదకి వచ్చి పరువుకి మొత్తం పోవడం తో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం మంచు విష్ణు మరో చీప్ ట్రిక్ ని ప్లే చేస్తున్నాడు.

Manchu Family
Manchu Family

అదేమిటంటే హౌస్ ఆఫ్ మంచు పేరుతో ఒక రియాలిటీ షో చేస్తున్నాము అని,అందులో భాగంగానే మొన్న మనోజ్ ఆ వీడియో విడుదల చేసాడని.  మంచు విష్ణు ఒక ‘హౌస్ ఆఫ్ మంచు’ పేరుతో ఒక టీజర్ ని విడుదల చేసారు.దీనిపై నెటిజెన్స్ మండిపడుతున్నారు,ఇలా ఆడియన్స్ ఎమోషన్స్ తో ఆదుకోవాలని చూస్తే ఎదో ఒక రోజు బయట కనపడినప్పుడు రాళ్లతో కొడుతారు, ఈసారి ట్రోల్ల్స్ తో సరిపెట్టరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

House of Manchus Teaser | House of Manchu's Reality Show | Mohan Babu | Vishnu Manchu

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version