
India Vs Australia 3rd Odi Chennai: క్రికెట్ ఆసీస్ అంటే స్కెడ్జింగ్, మంకీ గేట్ వివాదం, మైదానంలో ఆటగాళ్ల వెకిలి చేష్టలు, రెచ్చగొట్టే మాటలే గుర్తుకు వస్తాయి. మిగతా జట్లు చీకొట్టినా సరే క్రికెట్ ఆస్ట్రేలియా తన తీరు మార్చుకోదు. పైగా దీనిని క్రీడా స్ఫూర్తి అని కవరింగ్ ఇస్తుంది.. కానీ అలాంటి క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు మారుతోంది. జెంటిల్మెన్ గేమ్ కు అసలు అర్థం తెలుసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే గతంలో తన పై ఉన్న మచ్చలను కడిగేసుకునే ప్రయత్నం చేపడుతోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, మూడు వన్డే లు, టీ 20 లు ఆడటానికి గానూ ఆస్ట్రేలియా టీం ఇండియాలో పర్యటిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2_1 తేడాతో కోల్పోయింది. ఇక 3 వన్డేల సిరీస్ లో 1_1 తో సమంగా నిలిచింది.. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో బుధవారం మూడో వన్డే ఆడుతోంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా వికెట్ ఏమీ నష్టపోకుండా 50 పరుగులు చేసింది.
ఇక చేపాక్ స్టేడియంలో ఇండియాతో తలపడే ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్థానికంగా ఉన్న తమిళనాడు క్రీడాకారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిది స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది వర్ధమాన తమిళ క్రికెట్ క్రీడాకారులకు మెలకువలు నేర్పించారు. బ్యాటింగ్ ఎలా చేయాలి? బౌలింగ్ లో వైవిధ్య భరితమైన బంతులు ఎలా వేయాలి? ఒత్తిడిలో ఉన్నప్పుడు దానిని అధిగమించేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలి? అనే విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. కేవలం ఉపన్యాసం లాగా కాకుండా ప్రతి ఒక్క క్రికెటర్ తో సంభాషించారు.

మైదానంలో తాము ఎలా వ్యవహరిస్తామో చేసి చూపించారు.. ఇక ఈ కార్యక్రమాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తమిళనాడు క్రికెట్ క్లబ్ కూడా సహకారం అందించింది. వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టు విదేశాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది లేదు.. ప్రత్యర్థి జట్టు క్రీడాకారులతో సంభాషించింది లేదు. కానీ కాలానుగుణంగా ఆస్ట్రేలియా టీం కూడా మార్పును కోరుకుంటున్నది. మార్పు దిశగా అడుగులు వేస్తోంది. “మేము క్రికెట్ లో నైపుణ్యాలను భావితరాలకు తెలియజేయాలి అనుకుంటున్నాం. దీనివల్ల పోటీ తత్వం పెరుగుతుంది. క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి అంటే ఏంటో తెలుస్తుంది” అని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా టీం మునుపటిలా లేదు అని.. మునుపటి మచ్చలు మళ్ళీ కోరుకోవడం లేదని.
Why was my man labu removed from the tweet 😂😂. Justice for @marnus3cricket 😭😂 pic.twitter.com/pcPK8ef91Y
— Take it easy Urvashi (@James46344021) March 22, 2023