
Veld Grape : మనం ఏదైనా సులభంగా సాధించేది ఉంటే అది వాడికి నల్లేరుపై నడకే అంటారు. నల్లేరుకు అంతటి ప్రాధాన్యం ఉంది. నల్లేరుకు ఆయుర్వేదంలో మంచి విలువ ఇస్తుంటారు. పలు రోగాలకు ఇది ఔషధంగా మారుతుంది. నల్లేరును ఉపయోగించుకుని చాలా రోగాలకు మందుగా వాడుకోవచ్చు. ఎన్నో రకాల వ్యాధులకు ఇది పని చేస్తుంది. నల్లేరు మొక్కను ఆయుర్వేదంలో బాగా వాడతారు. అందుకే దీనికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. పలు రకాల ఇబ్బందులను తొలగించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
శ్వాస సంబంధమైన రోగాలకు ఇది దోహదపడుతుంది. కఫ, చర్మ రోగాలకు మంచి మందులా ఉపయోగపడుతుంది. నల్లేరు గుజ్జుతో సమానంగా మినప పప్పు తీసుకుని మెత్తగా నూరుకుని దాన్ని వడియాలు పెట్టుకుని వాటిని రెండు పూటల నిప్పులపై వేడి చేసుకుని తినడం వల్ల వాత రోగాలు దూరమవుతాయి. అన్ని రకాల వాత రోగాలు దూరమవుతాయి. నల్లేరును ఉపయోగించి ఎక్కిళ్లను కూడా సులభంగా పోగొట్టుకోవచ్చు. నల్లేరు కాడలను తీసుకుని వాటిని బాగా ఉడకబెట్టి దంచి రసాన్ని తీసుకుని అర చెంచా మోతాదులో తీసుకుని ఒక చెంచా తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల ఎక్కిళ్లు పోతాయి.

నల్లేరు గుజ్జుతో పచ్చడి లేదా కూర చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తొడలను స్తంభింపచేసే రోగాలకు చెక్ పెడుతుంి. నల్లేరును ముక్కలుగా చేసుకుని ఎండబెట్టి పొడి చేుకుని దాన్ని పావు టీ స్పూన్ మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గు సులభంగా తక్కువ అవుతుంది. నల్లేరు కాడలతో ఉప్పు, చింతపండు కారం కలిపి తీసుకుని పచ్చడిగా చేసుకుని అన్నంతో తినడంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. విరిగిన ఎముకలను అతికించేందుకు కూడా దోహదపడుతుంది.
నల్లేరును ఉపయోగించుకుని చాలా రకాల జబ్బుల నుంచి ఉపశమనం పొందొచ్చు. నల్లేరును ఉడికించి రసంగా చేసుకుని సమానంగా నెయ్యి తీసుకుని రెండింటిని కలిపి నెయ్యి మిగిలే వరకు వేడి చేసి రెండు పూటలా రెండు స్పూన్ల మోతాదులో ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఇలా నల్లేరుతో మనకు ఎన్నో లాభాలున్నాయి. నల్లేరుతో ఇన్ని రకాల ఫలితాలు ఉన్నందున పలు రకాల రోగాలకు మందులా మారుతుంది.