
Salman – Venkatesh – Ram Charan : సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా హిందీ లో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రానికి ఇది రీమేక్.ఇందులో జగపతి బాబు విలన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషించాడు.మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ సాంగ్ ఒకటి విడుదల చేసారు.’ఏంటమ్మా’ అంటూ సాగే ఈ పాటలో సల్మాన్ ఖాన్ మరియు విక్టరీ వెంకటేష్ తో పాటు కలిసి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదిరిపొయ్యే రేంజ్ లో స్టెప్పులు వేశారు.
ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.సల్మాన్ ఖాన్ గతం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ అనే చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.ఈ పాత్ర చేసినందుకు గాను సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు,అందుకు కృతజ్ఞతగా రామ్ చరణ్ ఈ పాట చేసాడు.ఈ విషయాన్నీ గాడ్ ఫాదర్ ప్రొమోషన్స్ సమయంలోనే సల్మాన్ ఖాన్ మీడియా కి తెలిపాడు.
నేరుగా వెండితెర మీదనే రామ్ చరణ్ డ్యాన్స్ ని చూస్తామేమో అనుకున్న ఫ్యాన్స్ కి సినిమా విడుదలకు ముందే చూసే అదృష్టం దక్కింది.ఈ సాంగ్ తో ఈ మూవీ హైప్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు విడుదల చేస్తే కచ్చితంగా అదిరిపొయ్యే రేంజ్ ఓపెనింగ్స్ రావడం పక్కా.మరి మేకర్స్ విడుదల చేస్తారో లేదో చూడాలి.సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ సాంగ్ పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.
