Suhana Khan: బాలీవుడ్ స్టార్ కిడ్స్ సూపర్ ఫాస్ట్. టీనేజ్ వచ్చిందో లేదో ముంబై కల్చర్ స్టార్ట్ చేస్తారు. గ్లామరస్ లుక్స్, నైట్ పార్టీస్, ఎఫైర్స్… అన్నింట్లోకి ఎంటరై పోతారు. బాలీవుడ్ బాద్షా షారుక్ కూతురు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. 22 ఏళ్ల సుహానా ఖాన్ పై అప్పుడే ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందతో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని బాలీవుడ్ టాక్. సుహానా ఖాన్ డెబ్యూ మూవీ ‘ది ఆర్కీస్’ లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ తాజా పుకార్లపై క్లారిటీ రావాల్సి ఉంది.
సుహానా ఖాన్ తన లేటెస్ట్ అప్పీరెన్స్ తో వార్తలకు ఎక్కారు. ముంబై వేదికగా జరిగిన నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ కి సుహానా ఖాన్ హాజరయ్యారు. డిజైనర్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన సుహానా మీడియాను విపరీతంగా ఆకర్షించారు. ఇంకా హీరోయిన్ గా ఓ స్థాయికి రాకుండానే స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్న సుహానా తీరు హాట్ టాపిక్ అయ్యింది. హాట్ క్లీవేజ్ షోతో హెడ్ లైన్స్ లో ఎక్కారు.
బాలీవుడ్ లో ఇది కామన్. పిల్లలు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్ అవుతామంటే అదేదో నేరంగా చూస్తారు. అక్కడ మాత్రం వారి అభిరుచిని ప్రోత్సహిస్తారు. హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుండి కలలు కంటున్న సుహానా ఖాన్ యాక్టింగ్ నేర్చుకున్నారు. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సులు కూడా చేశారు. ‘ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ’ టైటిల్ తో తెరకెక్కిన ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో సుహానా ఖాన్ నటించారు. ప్రస్తుతం ది ఆర్కీస్ టైటిల్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక షారుక్ పదేళ్లు సాలిడ్ హిట్ కోసం స్ట్రగుల్ అయ్యారు. ఆయన దాహం పఠాన్ మూవీతో తీరింది. జనవరిలో విడుదలైన పఠాన్ భారీ వసూళ్లు అందుకుంది. గత ఏడాది షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాబడ్డారు. దాదాపు నెల రోజులు ఆర్యన్ ఖాన్ జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో షారుక్ తీవ్ర మనోవేదన అనుభవించారు. ప్రముఖ లాయర్ల చుట్టూ తిరిగారు. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కి ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.