Virupaksha Collections: ‘విరూపాక్ష’ 3 రోజుల వసూళ్లు.. స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని అరుదైన రికార్డు

Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి వసూళ్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 25 […]

Written By: Vicky, Updated On : April 24, 2023 1:16 pm
Follow us on

Virupaksha Collections

Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి వసూళ్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 25 కోట్ల రూపాయలకు జరిగింది .మొదటి మూడు రోజుల్లోనే 90 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ ని సాధించింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు సమాచారం ప్రకారం ఈ సినిమా మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము.

ఈ చిత్రం మొదటి రోజు నుండి నైజాం లో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది, ట్రేడ్ పండితులు లెక్క ప్రకారం ఈ చిత్రం ఇక్కడ 3 రోజులకు కలిపి 7 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ ప్రాంతం లో కేవలం 7 కోట్ల రూపాయలకే జరిగింది. అంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి 20 లక్షల రూపాయిల లాభాల్ని కూడా అర్జించింది అన్నమాట.

Virupaksha Collections

అలాగే రాయలసీమ ప్రాంతం లో రెండు కోట్ల 30 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం లో రెండు కోట్ల 5 లక్షలు , ఈస్ట్ గోదావరి జల్లాలో కోటి 10 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 85 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 20 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 10 లక్షలు మరియు నెల్లూరు జిల్లాలో 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 16 కోట్ల 36 లక్షలు, మరియు ప్రపంచవ్యాప్తంగా కలిపి 21 కోట్ల రూపాయిలు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు.ఈరోజుతో అన్నీ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.