
Ravi Krishna: కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉన్నా సరైన బ్రేక్ దొరకక కెరీర్స్ ని ముగించేస్తూ ఉంటారు. కానీ కొంతమంది నటులకు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న అద్భుతమైన గుర్తింపు ఇప్పుడు లభిస్తుంది. ఉదాహరణకి రవి కృష్ణ ని తీసుకోవాలి.ఇతను మన చిన్నతనం లో ప్రసారమైన ‘మొగలి రేకులు’ సీరియల్ నుండి ఇండస్ట్రీ లో ఉన్నాడు. ఆ సీరియల్ పెద్ద హిట్ అవ్వడం తో ఇతనికి వరుసగా టీవీ సీరియల్స్ లో నటించే ఛాన్స్ దక్కింది, కానీ ఇతని నటనకి, ఇతనికి ఉన్న గ్లామర్ కి వెండితెర మీద కూడా మంచి అవకాశాలు రావాలి కానీ, ఇన్ని రోజులు రాలేదు.
అయితే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత రవికృష్ణ కి అడపాదడపా కొన్ని అవకాశాలు వచ్చాయి.ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం లో అద్భుతమైన పాత్ర దొరికింది. హీరో మరియు హీరోయిన్ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న పాత్ర అది.
ఈ చిత్రం లో అతను కనిపించిన ప్రతీసారి ఆడియన్స్ కి గుండెలు జారినంత పని అయ్యింది.ముఖ్యంగా రైల్వే స్టేషన్ సన్నివేశం అయితే థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మనం మర్చిపోలేము, అంత అద్భుతంగా చేసాడు ఆయన. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు కానీ రవికృష్ణ కి మంచి క్యారక్టర్ పడింది. ఈ సినిమా లో అతని నటన చూసిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు కూడా రవికృష్ణ ని తమ సినిమాలో నటింపచేసేందుకు అడ్వాన్స్ తో సిద్ధంగా ఉన్నారు.

ఇక నుండి రవికృష్ణ ని టాలీవుడ్ లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా చూడబోతున్నాము అన్నమాట. కెరీర్ లో ఇలాంటి మలుపులు అంత తేలికగా రావు,రవికృష్ణ కి వచ్చింది అంటే సాధారణమైన విషయం కాదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అతను జాగ్రత్తగా వినియోగించుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తులో కేవలం టాలీవుడ్ లోనే కాదు, సౌత్ లోనే టాప్ ఆర్టిస్టుగా నిలిచిపోతాడు.