Golden Globe Award On RRR: ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నామినేట్ కాగా… అవార్డు గెలుపొందింది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ఆర్ ఆర్ ఆర్ టీం హాజరయ్యారు. ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో నామినేట్ అయ్యింది. నామినేషన్స్ లో ఉన్న మిగతా సాంగ్స్ ని వెనక్కి నెట్టి నాటు నాటు అవార్డు దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు ని ఎంపిక చేశారు. ఒక మాస్ సాంగ్ ఈ గౌరవం అందుకోవడం అరుదైన విషయం.

2009లో ఏ ఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ లిస్ట్ లో కీరవాణి చేరారు. వేదికపైకి వెళ్లి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని అందుకున్నారు. కీరవాణి ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. మూడు దశాబ్దాలకు పైగా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఆయనతో పాటు పరిశ్రమకు వచ్చిన ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ కనుమరుగయ్యారు. కీరవాణి మాత్రం ఎప్పటికప్పుడు జనరేషన్స్ కి తగ్గట్లు తన మ్యూజిక్ లో మార్పులు తెస్తూ రాణిస్తున్నారు.
రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఉన్నారు. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఆర్ ఆర్ ఆర్ వరకు కీరవాణినే సంగీతం అందించారు. రాజమౌళికి కీరవాణి కజిన్ అవుతారు. రాజమౌళి సక్సెస్ ఫుల్ జర్నీలో కీరవాణికి కూడా భాగం ఉంది. ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో అన్న కీరవాణి అరుదైన పురస్కారం అందుకునేందుకు దోహదం చేశారు.

ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో ఆస్కార్ ఆశలు మరింత బలపడ్డాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ కూడా అందుకుంటుంది అనే నమ్మకం పెరిగింది. నిజంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకుంటే అతిపెద్ద విజయం అవుతుంది. రాజమౌళి చేరుకున్న అరుదైన మైలురాయి అవుతుంది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా హాజరయ్యారు. రాజమౌళి సైతం రమా రాజమౌళితో పాటు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరించారు.