https://oktelugu.com/

RRR Trailer : ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం

RRR Trailer (Telugu) :రాజమౌళిని ఎందుకు దర్శకధీరుడు అంటారో.. ఎందుకు ప్రపంచమంతా ఆయన దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయ్యిందో బాహుబలిని చూస్తే అర్థమవుతుంది. కానీ అంతకుమించిన బీభత్సం ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో రాబోతోంది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. నరాలు తెగేలా ఉంది. రోమాలు నిక్కబొడిచేలా పోరాటాలు ఉన్నాయి. రాజమౌళి తీర్చిదిద్దిన ఈ చిత్రం చూస్తే జనాలు థియేటర్లలో హాహాకారాలు చేసేలా ఉంది.   ఇప్పటివరకూ దాచేసిన పులితో ఎన్టీఆర్ (కొమురంభీం) పోరాటాన్ని రాజమౌళి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2021 / 11:16 AM IST
    Follow us on

    RRR Trailer (Telugu) :రాజమౌళిని ఎందుకు దర్శకధీరుడు అంటారో.. ఎందుకు ప్రపంచమంతా ఆయన దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయ్యిందో బాహుబలిని చూస్తే అర్థమవుతుంది. కానీ అంతకుమించిన బీభత్సం ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో రాబోతోంది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. నరాలు తెగేలా ఉంది. రోమాలు నిక్కబొడిచేలా పోరాటాలు ఉన్నాయి. రాజమౌళి తీర్చిదిద్దిన ఈ చిత్రం చూస్తే జనాలు థియేటర్లలో హాహాకారాలు చేసేలా ఉంది.

    RRR Trailer

     

    ఇప్పటివరకూ దాచేసిన పులితో ఎన్టీఆర్ (కొమురంభీం) పోరాటాన్ని రాజమౌళి ఇప్పుడు తాజా ట్రైలర్ ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పులితో ఎన్టీఆర్ ఎదురొడ్డి పోరాడిన బిట్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. ఆదిలాబాద్ గోండు గిరిజనుల నుంచి ఒక చిన్నారిని బ్రిటీష్ వారు ఎత్తుకుపోతే పోరాటానికి వస్తున్న కొమురంభీం కథను రాజమౌళి ఎంచుకున్నట్టు తెలుస్తోంది.ఇదే విషయాన్ని తన స్నేహితుడు రాజీవ్ కనకాల ద్వారా బ్రిటీష్ వారికి చెప్పింది ఆ పాత్రను పరిచయం చేశారు.

    బ్రిటీష్ వారితో కలిసి పనిచేసే పోలీస్ పాత్రలో రాంచరణ్ నటించారు. అనంతరం కొమురం భీంతో కలిసి స్వంతంత్ర్యం కోసం పోరాడే అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ‘పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి.. ఆ పని రాంచరణ్’ అని బయటపెట్టాడు. ఇక రాంచరణ్ పోరాటాలు.. ఎన్టీఆర్, చరణ్ కలిసి ఒక రైలును పేల్చేసే విధానం గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.

    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?

    ప్రతి దృశ్యం ఒక అద్భుతంగా జక్కన్న చెక్కాడు. ముఖ్యంగా ఎమోషన్స్ పంట పండించాడు. ఆలియా భట్ ను బ్రిటీష్ వారి చేతుల్లో తన్నులు తినే పాత్రలో చూపించారు. రాంచరణ్, ఎన్టీఆర్ లు సైతం బ్రిటీష్ వారి చేతుల్లో దెబ్బలు తినేలా చూపించారు. అనంతరం కసితో రగిలిపోయి చంపేసిన తీరు హైలెట్ అని చెప్పొచ్చు. విల్లు చేతబట్టి అల్లూరిలా బాణాలు విడిచిన రాంచరణ్ లుక్ ట్రైలర్ లో అదిరిపోయింది.చివరల్లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి టవర్ పైకి ఎక్కేసీన్ హైలెట్ గా చెప్పొచ్చు.

    మొత్తంగా ఈ ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంది. మునుపెన్నడూ లేనంతా వెండితెర అద్భుతాన్ని రాజమౌళి ఈ ట్రైలర్ తో చూపించారు. పోరాట సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ఎమోషన్స్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రాజమౌళి మరో అద్భుతాన్నే తెరపై చూపించబోతున్నాడని అర్థమవుతోంది.

    ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఇదే..

    Also Read: ఫస్ట్ఆఫ్​​ మొత్తం తారక్​.. సెకండ్ ఆఫ్​లో రామ్​ బీభత్సం.. ట్రైలర్​లో రాజమౌళి చెప్పింది ఇదేనా?