https://oktelugu.com/

Horoscope 2022: వచ్చే ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండబోతోందంటే!

Horoscope 2022: సాధారణంగా ప్రతి ఒక్కరికి వారి జీవితం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వారి రాశి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉత్సాహం కూడా కలిగి ఉంటుంది.ఇక మరికొన్ని రోజులలో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో చాలా మంది వచ్చే ఏడాది తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తుంటారు మరి వచ్చే ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే… మేష రాశి వారికి 2022 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 9, 2021 / 11:16 AM IST

    rashi-phalalu-2022

    Follow us on

    Horoscope 2022: సాధారణంగా ప్రతి ఒక్కరికి వారి జీవితం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వారి రాశి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉత్సాహం కూడా కలిగి ఉంటుంది.ఇక మరికొన్ని రోజులలో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో చాలా మంది వచ్చే ఏడాది తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తుంటారు మరి వచ్చే ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే… మేష రాశి వారికి 2022 సంవత్సరం ఎంతో అదృష్టం అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పనులు ఉద్యోగ అవకాశాలు ఈ ఏడాదిలో నెరవేరుతాయి. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ ఏడాది ఎంతో సానుకూలంగా ఉంది.

    Horoscope 2022

    మేష రాశి వారికి సూర్యుడు మకరరాశిలో శని గ్రహంతో కలిసి ఉండటం వల్ల తండ్రితో కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. కావున ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం ఒకవేళ మీ తండ్రి నీకు ఏదైనా చెప్పినప్పుడు ఆ విషయం గురించి సానుకూలంగా ఆలోచించడం వల్ల మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు.కేవలం కుటుంబ విషయాలలో మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలలో కూడా మేష రాశి వారికి 2022 వ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంది. విద్యార్థులకు మొదటి మూడు నెలలు ఎంతో సానుకూలంగా ఉన్నాయి.

    Also Read: చాణక్య నీతి: పిల్లల విజయంలో తండ్రిది కీలక పాత్రేనా?

    ఇక ఈ రాశివారు వివాహం చేసుకోవడం ద్వారా వారి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మేష రాశి వారికి ఏప్రిల్ తర్వాత సామాజిక స్థాయిలో కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఏప్రిల్ 29 కుంభ రాశిలో శని సంచారం చేయటం వల్లమీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది గతంలో ఎంతో కష్టపడి పనిచేసిన ఆ ఫలితం ఇప్పుడు మీకు దక్కుతుంది.ఈ ఏడాది రాహువు మీ సొంత రాశిలో ఉండటం వల్ల కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆత్రుత అధికంగా ఉంటుంది అలాగే కొన్ని చింతనలను కూడా కలిగిస్తాడు.

    ఇక ఏడవ ఇంటిలో కేతువు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో కొన్నిసమస్యలు ఎదురవుతాయి.అయితే ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం మీ చేతుల్లోనే ఉంటుంది కనుక మీ వైవాహిక జీవితాన్ని ఎంతో అందంగా మార్చుకోవడం కోసం ప్రయత్నించాలి. మొత్తానికి ఈ రాశి వారికి వచ్చే ఏడాది అదృష్టం గానే ఉంది అని చెప్పవచ్చు.

    Also Read: నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు… చేస్తే సమస్యలు తప్పవు!