
RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ రికార్డుల పర్వం ఇంకా ముగియలేదు.ఈమధ్యనే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ని గెలుచుకొని చరిత్ర సృష్టించిన #RRR ఇప్పుడు ‘గూగుల్ సెర్చ్’ లో హాలీవుడ్ మూవీస్ ని సైతం వెనక్కినెట్టి సంచలనం సృష్టించింది.ఆస్కార్ అవార్డు గెలిచినా తర్వాత ప్రతీ ఒక్కరికి ఈ సినిమాని సెర్చ్ చేసి నటీనటుల గురించి మరియు దర్శకుడి గురించి తెలుసుకోవాలనే తాపత్రయం కనిపించింది.
అలా ప్రపంచం నలుమూలల ఉన్న సినీ అభిమానులు ఈ సినిమా గురించి వెతికారు.ఓకే ప్రముఖ జపాన్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం, ఇంతకు ముందు ఈ సినిమా కోసం గూగుల్ లో వెతికినవారికంటే 1,105 శాతం అధికంగా ఆస్కార్ అవార్డు ప్రకటించిన తర్వాత జనాలు వెతికారంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.రీసెంట్ హాలీవుడ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి బిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలకంటే కూడా #RRR చిత్రం గురించే నెటిజెన్స్ ఎక్కువగా వెతికారట.

దీనిని బట్టీ గ్లోబల్ వైడ్ ‘నాటు నాటు’ పాటని ఆడియన్స్ ఎంతలా ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.ఈ ఘనత మొత్తం రామ్ చరణ్ – ఎన్టీఆర్ లది మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు.తెరవెనుక ఎంతమంది కష్టపడినా కూడా దానిని ఆడియన్స్ కి ఈ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేసింది మాత్రం వాళ్ళిద్దరి డ్యాన్స్ స్టెప్పులే.హీరోలిద్దరు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న ‘గ్లోబల్ స్టార్’ ఇమేజి వాళ్ళ కష్టానికి తగిన ఫలితం.వాళ్లకి వచ్చిన ఈ ‘గ్లోబల్ స్టార్’ ఇమేజి తదుపరి చిత్రాలకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.
ఇప్పటికే రామ్ చరణ్ తో పలు హాలీవుడ్ సంస్థలు సినిమాలు చెయ్యడానికి సిద్ధం గా ఉన్నారు.చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.ఇక జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తుతం ఎవరికీ క్లారిటీ లేదు కానీ, ఆయనకీ కూడా ఇదే రేంజ్ అవకాశాలు భవిష్యత్తులో రానున్నాయట.