https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’లో ఇరుక్కుపోయిన ఎన్టీఆర్.. సేఫ్ అయిన చెర్రీ?

‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్యాన్ ఇండియా మూవీ రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మిస్తుండగా కీరవాణి అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మల్టిస్టారర్ మూవీ రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ ఇరుక్కుపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’లో తన షూటింగ్ జూన్ నాటికే పూర్తవుతందని ఎన్టీఆర్ భావించాడు. ఈక్రమంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 12:40 PM IST
    Follow us on

    ‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్యాన్ ఇండియా మూవీ రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మిస్తుండగా కీరవాణి అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మల్టిస్టారర్ మూవీ రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ ఇరుక్కుపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’లో తన షూటింగ్ జూన్ నాటికే పూర్తవుతందని ఎన్టీఆర్ భావించాడు. ఈక్రమంలో తన తదుపరి మూవీని త్రివిక్రమ్ తో ప్లాన్ చేసుకున్నారు. ఈమేరకు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా అధికారికంగా వచ్చింది.

    Also Read: బిగ్ బాస్ ట్వీస్ట్.. కెప్టెన్ ఎలిమినేషన్.. ఇప్పుడెలా?

    కరోనా ఎఫెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’పై పడటంతో సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై క్లారిటీ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ ఆలస్యంపై ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనేది రాజమౌళి క్లారిటీ లేకపోవడంతో త్రివిక్రమ్ కు ఏం చెప్పాలని ఎన్టీఆర్ టెన్షన్ పడుతున్నాడు.

    ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ ఇరుక్కుపోవడంతో చరణ్ అలర్టయ్యాడు. చరణ్ తన తదుపరి మూవీని ఇప్పటివరకు ఏ దర్శకుడితో ఖరారు చేయలేదు. కేవలం తాను నటిస్తూ నిర్మిస్తున్న ‘ఆచార్య’పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చరణ్ ఇప్పటికే పలు కథలు వింటున్నప్పటికీ దేనికి కూడా గ్రీన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యేకే తన తదుపరి మూవీని చరణ్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ఆర్ఆర్ఆర్ అప్డేట్.. భారీ యాక్షన్ సీన్ వైరల్..!

    రాజమౌళి సైతం ఎన్టీఆర్ పై షూటింగ్ త్వరగా పూర్తిచేసి అతడిని రివీల్ చేయనున్నాడనే టాక్ విన్పిస్తోంది. రాంచరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయ్యే వరకు షూటింగ్ కొనసాగిస్తాడని తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ లో కొంచెం గ్యాప్ తీసుకొని ఆచార్యలో స్పెషల్ రోల్ చేస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తొలుత ‘ఆర్ఆర్ఆర్ నుంచి బయట పడనుండగా అది ఎప్పటివరకు అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.