https://oktelugu.com/

హవ్వా.. బాబు నియోజకవర్గానికి జగన్‌ నీళ్లివ్వాలంట

ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు తన సొంత జిల్లాను.. తన సొంత నియోజకవర్గాన్ని.. తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే చూసుకుంటాడు. మిగితా ప్రాంతాలకన్నా ఆదర్శంగా తీర్చిదిద్దాలను అనుకుంటుంటాడు. అదేంటో ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కుప్పానికి నీళ్లు అందించడంలో వైఎస్సార్‌‌ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందంటూ తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. నిజం చెప్పాలంటే కుప్పం చంద్రబాబు నియోజకవర్గం. మరి ఐదేళ్లు అధికారం ఉండి ఆయన ఏం చేసినట్లు అని ఇప్పుడు అందరిలో నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 12:45 PM IST
    Follow us on

    chandrababu jagan

    ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు తన సొంత జిల్లాను.. తన సొంత నియోజకవర్గాన్ని.. తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే చూసుకుంటాడు. మిగితా ప్రాంతాలకన్నా ఆదర్శంగా తీర్చిదిద్దాలను అనుకుంటుంటాడు. అదేంటో ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కుప్పానికి నీళ్లు అందించడంలో వైఎస్సార్‌‌ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందంటూ తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. నిజం చెప్పాలంటే కుప్పం చంద్రబాబు నియోజకవర్గం. మరి ఐదేళ్లు అధికారం ఉండి ఆయన ఏం చేసినట్లు అని ఇప్పుడు అందరిలో నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    హంద్రీనీవా ప్రాజెక్టు ప‌నులు నెమ్మదిగా సాగుతున్నాయ‌ని, వాటిని వేగంగా పూర్తి చేసి కుప్పానికి నీళ్లు అందించాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. కుప్పానికి నీళ్లు అందించాల‌ని టీడీపీ కార్యక‌ర్తలు చేసే డిమాండ్‌ మంచిదే అయినప్పటికీ.. ఈ డిమాండ్‌ను ఇప్పుడు రోజురోజుకూ వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు.. ధర్నాలు, యాత్రలు నిర్వహిస్తున్నారు.

    Also Read: జగనన్న విద్యాదీవెన మార్గదర్శకాలు విడుదల.. ఫీజులపై కీలక నిర్ణయం..?

    అయితే.. వీటన్నింటిని చూస్తున్న జనం కూడా అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అది టీడీపీ నేతలపై. పచ్చచొక్క బ్యాచ్‌ ఇన్నాళ్లు ఏం చేశారంటూ గట్టిగనే ప్రశ్నిస్తున్నారు చిత్తూరు జిల్లా ప్రజలు. మరోవైపు వార్తల్లో రాయలేని భాషలో తిట్టిపోస్తున్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించారు. అన్ని సంవత్సరాలు కూడా ఆయన కుప్పం నుంచే గెలుపొందారు. అలాంటిది ఆ 14 ఏళ్లలో చంద్రబాబు ఆ నియోజకవర్గంపై పెట్టిన శ్రద్ధ ఏపాటిదోనని నిలదీస్తున్నారు.

    ఒక్క కుప్పం విష‌యంలోనే కాదు.. హంద్రీనీవా ప్రాజెక్టు విష‌యంలోనూ బాబు చూపిన శ్రద్ధ తక్కువే. ఎన్టీఆర్ హ‌యాంలో శంకుస్థాప‌న జ‌రిగి, దాదాపు కాలువ‌ల ప్లాన్ కూడా అప్పటికే రెడీ అయిన హంద్రీనీవా ప్రాజెక్టుకు త‌న తొమ్మిదేళ్ల పాల‌న‌లో చేసిందేం లేదు. ఒక‌టి కాదు రెండు కాదు తొమ్మిదేళ్ల అధికార కాలంలో తొమ్మిది అడుగుల కాలువైనా తవ్వారా..? అనేది ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజల ప్రశ్న.

    Also Read: టీఆర్‌ఎస్‌కు ‘దుబ్బాక’ సెగ తగలనుందా..?

    అలాంటిది వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకే టీడీపీ నేతలు ఇలాంటి ధ‌ర్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడి చేత‌గాని త‌నాన్ని, అస‌మ‌ర్థత‌ను, రాయ‌ల‌సీమ‌పై ఆయ‌న‌కున్న నిర్లక్ష్యాన్ని హైలెట్ చేయ‌డానిక‌న‌మాట‌. సొంత జిల్లాకు, సొంత నియోజ‌క‌వ‌ర్గానికి నీళ్లు అందించే ప‌నులు చేయ‌కుండా, ఇప్పుడు ధ‌ర్నాలు చేయిస్తూ చంద్రబాబు త‌న అస‌మ‌ర్థత‌ను మరోసారి నిరూపించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.