https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ అలా.. ఎన్టీఆర్ ఎలా?

‘బాహుబలి’ సిరీసులు తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కన్పించబోతున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి.. మెగా ఫ్యాన్స్ ఈ  మూవీ కోసం అత్రుతగా ఎదురు చూస్తున్నారు. Also Read: ‘బాహుబలి’ని మించి.. ఔరా అనిపిస్తున్న ప్రభాస్ మార్కెట్ కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగు వాయిదా పడగా.. ఇటీవలే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 10:50 AM IST
    Follow us on

    ‘బాహుబలి’ సిరీసులు తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కన్పించబోతున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి.. మెగా ఫ్యాన్స్ ఈ  మూవీ కోసం అత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    Also Read: ‘బాహుబలి’ని మించి.. ఔరా అనిపిస్తున్న ప్రభాస్ మార్కెట్

    కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగు వాయిదా పడగా.. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజమౌళి విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపాడు. దీంతోపాటు ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కోసం ఈనెల 22న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే చరణ్ టీజర్ రిలీజైంది. చరణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట చిత్రబృందం ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో నందమూరి.. మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. జక్కన్న చరణ్ ను పోలీస్ గా చూపించాడు.

    ప్రస్తుతం యూట్యూబ్లో అత్యధిక లైక్స్ సాధించిన వీడియోగా చరణ్ టీజర్ రికార్డు సృష్టించింది. తాజాగా ఎన్టీఆర్ టీజర్ ఈనెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ పేరిట రిలీజ్ కానుంది. ఇందులో ఎన్టీఆర్ ను జక్కన్న ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. చరణ్ ను పోలీసుగా చూపించిన జక్కన్న ఎన్టీఆర్ ను బందిపోటుగా చూపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: రష్మికు నందు ఘాటు ముద్దు !

    ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు. ఈనెల 22న విడుదల కానున్న స్పెషల్ టీజర్లో కొమురంభీం గెటప్ ను కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ను మించేలా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఉంటుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.