దొంగ డాక్టర్ల పై సామాన్యుడి దండయాత్ర !

బట్టతల పై జుట్టు పెట్టించుకోవడానికి వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకున్నవారిని చూశాం. అనేక సైడ్ ఎఫెక్ట్ లతో చాల రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారి గురించి విన్నాం. నిజానికి హెయిర్ ప్లాంటేషన్ అనేది ప్రాణాలు తీసేంత సర్జరీ కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చేంత సర్జరీ కూడా కాదు. మరీ ఎందుకు వేల మంది జుట్టు కోసం వెళ్ళి అగచాట్లు పాలవుతున్నారు..? కారణం ఒక్కటే నకిలీ క్లినిక్స్ . అవును, సమస్య అంతా పక్కా భోగస్ హెయిర్ […]

Written By: admin, Updated On : October 17, 2020 1:13 pm
Follow us on


బట్టతల పై జుట్టు పెట్టించుకోవడానికి వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకున్నవారిని చూశాం. అనేక సైడ్ ఎఫెక్ట్ లతో చాల రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారి గురించి విన్నాం. నిజానికి హెయిర్ ప్లాంటేషన్ అనేది ప్రాణాలు తీసేంత సర్జరీ కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చేంత సర్జరీ కూడా కాదు. మరీ ఎందుకు వేల మంది జుట్టు కోసం వెళ్ళి అగచాట్లు పాలవుతున్నారు..? కారణం ఒక్కటే నకిలీ క్లినిక్స్ . అవును, సమస్య అంతా పక్కా భోగస్ హెయిర్ క్లినిక్స్ దగ్గరే ఉంది. మరి, ఆ నకిలీ క్లినిక్స్ ను గుర్తించి వాటికి దూరం జరగడం ఎలా ? అసలు ఇప్పటి కాలుష్య ప్రపంచంలో జుట్టు సమస్య లేని మనుషులు లేరేమో. అంతగా ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది. అందుకే ఎక్కడిక్కడ హెయిర్ క్లినిక్స్ పుట్టుకొచ్చాయి. పళ్ళ డాక్టర్లు హెయిర్ సర్జెన్స్ అయిపోయారు. నర్సులు ఏకంగా హెయిర్ క్లినిక్స్ పెట్టేశారు. వీళ్ళంతా.. బట్టతలతో వచ్చిన వాడి ఒంటిని, జేబును గుల్ల చేసి.. చివరకు చేతగాని వైద్యంతో వాడి ప్రాణాల మీదే ప్రయోగాలు చేసి పంపిస్తున్నారు.

Also Read: కులాలకు చెల్లు.. జగన్ మరో సంచలన నిర్ణయం

వీటిన్నటి మధ్యలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. మన రెండు తెలుగు రాష్ట్రాలలోని క్లినిక్స్ లో దాదాపు 50 % పైగా ఉన్న క్లినిక్స్ పూర్తిగా నకిలీవే. ఎలాంటి లైసెన్స్ లేకుండా.. కనీసం డాక్టర్లు కూడా లేకుండా సిబ్బందితోనే వైద్యం చేయిస్తూ.. మనుషుల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు. దురదృష్టం ఏమిటంటే.. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి నకిలీ హెయిర్ క్లినిక్స్ ను, నకిలీ డాక్టర్లను గుర్తించడంలో ప్రభుత్వాలతో పాటు పోలీస్ వ్యవస్థ, మీడియా చానెల్స్ కూడా విఫలమైయ్యాయి. కానీ ఓ వ్యక్తి ఈ నకిలీ క్లినిక్స్, నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు చేశాడు. పేరు ‘సోహైల్ ఖాన్’. అనితరసాధ్యమైన స్థాయిలో ఇన్వెస్టిగేటీవ్ చేసి పూర్తి సాక్ష్యాధారాలతో నకిలీ బాగోతాలు ముసుగులు తీసి వీడియోల రూపంలో మన ముందు నిలబెట్టాడు. ఆయన వీడియోలను చూడాలంటే యూట్యూబ్ లో Medical M@fia అని కొట్టండి.

Also Read: దేశంలో మనం బతికే రేటు పెరిగింది!

ఎంతో రిస్క్ చేసి.. ఇకెంతో కష్టపడి ఫేక్ హాస్పిటల్స్ గురించి నిజాలను వెలికి తీస్తున్న సోహైల్ ఖాన్ ను అభినందించాల్సిన భాద్యత మన పై, మన ప్రభుత్వాల పై ఉంది. ప్రజలకు మేలు చేసేందుకు, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారిని చైతన్యవంతం చేసేందుకు ‘సోహైల్ ఖాన్’ చేస్తోన్న నిరంతరం కృషి అనిర్వచనీయము. ఆయన ఇలాగే నకిలీగాళ్ళ ముసుగులు తొలిగించాలని కోరుకుందాం.