Rent Wives: మన దేశం ఎన్నో మతాలు, కులాలకు నిలయం. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. మన దేశంలో ఉన్న ఆచారాలు విచిత్రంగానూ వింతగానూ ఉంటాయి. వీటిని చూస్తే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. కొన్నింటిని చూస్తే భయమేస్తుంది. మానవ సంబంధాల్లో భార్యాభర్తల అనుబంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జీవితాంతం కలిసుంటే దంపతుల మధ్య ప్రేమానుబంధాలు పెనవేసుకోవడం సహజం. ఆలుమగలు కలకాలం కలిసే ఉంటారు. అలాంటి ధర్మపత్నిని కూడా అంగడి సరుకుగా చేసే ఆచారాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో భార్యలను అద్దెకు ఇచ్చే ఆచారం ఉందంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు. కానీ అక్షరాలా ఇది నిజం. ఒక వ్యక్తి భార్యను మరో వ్యక్తికి అద్దెకు ఇవ్వడం. సాధారణంగా ఇల్లు, వస్తువులు అద్దెకు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం కట్టుకున్న ఆలినే అద్దెకు ఇవ్వడం వింతైన ఆచారం. శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో తమ భార్యలను భర్తలు అద్దెకు ఇస్తారు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరాలపాటు ఇస్తారు. దీన్ని ధదీచ ప్రాత అని పిలుస్తుంటారు.
భార్యలను అద్దెకు తీసుకెళ్లే వ్యక్తి వారి భర్తలకు రూ.10 లేదా 100 స్టాంపు కాగితాలపై సంతకాలు పెట్టి, ధర మాట్లాడుకుని అద్దెకు తీసుకుపోతారు. ఇక్కడ గ్వాలియర్ రాజపుత్రులు ఎక్కువగా ఉంటారు. వీరు ధనవంతులు కావడంతో వీరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి. దీంతోనే వారు అక్కడి వారి భార్యలను అద్దెకు తీసుకెళ్తుంటారు. ఒక్కో మహిళకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు అద్దె చెల్లించడం గమనార్హం. వయసు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వయసు ఎక్కువ ఉన్న వారికి డిమాండ్ తక్కువ ఉంటుంది.

అద్దెకు తీసుకెళ్లిన తరువాత వారికి పిల్లలు పుడితే వారి బాధ్యతే. పెళ్లి కాని వారిని కూడా అద్దెకు తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి. ఈ ఆచారాన్ని ఎంత దూరం చేయాలని ప్రయత్నించినా కుదరడం లేదు. ఇంకా ఈ ఆచారం మధ్యప్రదేశ్ లోనే కాకుండా గుజరాత్ లో కూడా మనుగడలో ఉండటం గమనార్హం. ఇలాంటి వింతైన ఆచారాలు మన దేశంలో ఉండటంతో కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కానీ వాటిని మానడానికి అక్కడి ప్రజలు అంగీకరించడం లేదు. దీంతోనే ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ వారు మాత్రం ఈ ఆచారాన్ని వదలడం లేదు.