మెగాస్టార్ గా చిరంజీవిని మలచడంలో ఆయనకు పిల్లనిచ్చిన మామ అల్లు రామలింగయ్య పాత్ర కాదనలేనిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవికి కూతురును ఇవ్వడమే కాదు.. ఇండస్ట్రీలో నిలబెట్టిన ఘనత అల్లు రామలింగయ్య సొంతం
అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో ఓ సీనియర్ నటుడిగా అప్పటికే నిరూపించుకున్నాడు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ ను సినిమాల్లో నిర్మాతగా నిలిపారు. ఈ క్రమంలోనూ కూతురు సురేఖను అప్పుడే సినిమాల్లోకి వచ్చి హీరోగా నిరూపించుకున్న చిరంజీవి టాలెంట్ చూసి అతడికి కూతురును ఇచ్చి వివాహం జరిపించారు అల్లు రామలింగయ్య..
కొణిదెల శివశంకర వరప్రసాద్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి పునాది రాళ్లు సినిమాతో చిరంజీవిగా వెండితెర ఇలవేల్పుగా మారిపోయాడు. పునాది రాళ్లు తరువాత వరసగా చిన్న చిన్న పాత్రలు , నెగెటివ్ రోల్స్ చేస్తూ హీరో అవకాశాలు దక్కించుకున్నాడు. హీరోగా అవకాశం దక్కించుకొని హిట్ కొట్టి .. అల్లు రామలింగయ్య దృష్టిని ఆకర్షించాడు. భవిష్యత్తులో చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్ర్రీ ని శాసించే స్థాయికి ఎదుగుతాడని ముందుగానే గ్రహించిన అల్లు రామలింగయ్య ఆలస్యం చేయకుండా తన అల్లుడిని చేసుకున్నాడు.
నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన అల్లుడు, అగ్ర కథానాయకుడు చిరంజీవి ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరంజీవి పెళ్లిలో మామ అల్లు రామలింగయ్య ఆశీర్వాదం ఇస్తున్న ఆ ఫొటో అపురూపంగా నిలిచింది.