Pawan Kalyan – Harish Shankar : పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రం ‘గబ్బర్ సింగ్’..పదేళ్ల నుండి సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా ఎవ్వరూ ఊహించని రీతిలో కంబ్యాక్ అయ్యాడు..ఇప్పటికి కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలాంటి కంబ్యాక్ మూవీ ఏ హీరో కి కూడా పడలేదని చెప్పొచ్చు..డైరెక్టర్ హరీష్ శంకర్ తనకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం మొత్తాన్ని ఈ సినిమా ద్వారా చూపించుకున్నాడు.

మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని ప్రకటించాడు హరీష్ శంకర్..మూడేళ్ళ క్రితం ప్రకటించబడ్డ ఈ సినిమా ఇప్పటి వరుకు సెట్స్ మీదకి వెళ్ళలేదు..దీనితో ఫ్యాన్స్ అసలు ఈ సినిమా ఉందా లేదా అనే డైలమా లో పడ్డారు..కానీ మేకర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉండనే చెప్పుకుంటూ వచ్చారు.
అయితే ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ బదులు..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన తేరి మూవీ ని రీమేక్ చేయబోతున్నాడని తెలిసింది..గబ్బర్ సింగ్ తరహాలోనే కథలో భారీ మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట హరీష్ శంకర్..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు లేదా రేపు రానుంది..అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ రీమేక్ ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..మరో సంవత్సరం ఆలస్యం అయినా పర్వాలేదు..రీమేక్ సినిమాతో మాత్రం రావొద్దు..సొంత కథతో ఫ్లాప్ వచ్చినా పర్వాలేదు..ఇలా ఓటీటీ కాలం లో కూడా రీమేక్స్ అంటే తట్టుకోవడం మావల్ల కాదు.
దయచేసి రీమేక్ వద్దు అంటూ #WedontwantTheriRemake అనే హాష్ ట్యాగ్ మీద ట్విట్టర్ లో భారీ ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..తేరి రీమేక్ ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యి ‘పోలీసోడు’ అనే పేరు తో విడుదల చేసారు..థియేటర్స్ లో తెలుగు లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని..టీవీ లో వారానికి ఒకసారి టెలికాస్ట్ చేసేవారు..అలాంటి సినిమాని రీమేక్ చెయ్యడం అంటే మంచి నిర్ణయం కాదనే చెప్పాలి.