Reliance Campa Cola: వ్యాపార దిగ్గజ సంస్థ రిలయన్స్ దూకుడు తెలిసిందే. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతోంది. నిత్యావసరాల వస్తువుల విక్రయంలో దినదినం వృద్ధి చెందుతున్న రిలయన్స్ మరో రంగంలోకి అడుగెడుతోంది. మనదేశంలో కూల్ డ్రింక్స్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా థమ్సప్, కోకాకోలా, పెప్సీ లాంటి సంస్థలు ముందుకు వెళ్తున్నాయి. దీంతో రిలయన్స్ సంస్థ కూడా గతంలో ఉన్న కంపా డ్రింక్స్ ను మార్కెట్లోకి తీసుకురావాలని అంబానీ ప్రకటించడంతో అందరిలో ఆసక్తి కలుగుతోంది. రిలయన్స్ సంస్థ మార్కెట్లో విస్తరిస్తున్న క్రమంలో ఇతర సంస్థల డ్రింక్స్ విక్రయిస్తోంది. దీంతో తామే వాటిని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కంపా డ్రింక్స్ ను మార్కెట్ చేయాలని సంకల్పించారు.

ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి చెందిన కంపా కోలా, సోస్యో సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసింది. దీంతో వీటిని మార్కెట్లోకి తీసుకురావాలని శరవేగంగా కసరత్తులు చేస్తోంది. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసి కంపా కోల డ్రింక్స్ ను కూడా పోటీ ప్రపంచంలో నిలపాలని ప్రయత్నిస్తోంది. ఈ కూల్ డ్రింక్స్ ను వ్యాపారంలో భాగంగా తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా చకచకా సాగుతున్నాయి. త్వరలో తమ మార్కెట్ల ద్వారా ఈ డ్రింక్స్ ను విడుదల చేయాలని చూస్తోంది.
మనం నిత్యం వాడే నిత్యావసరాలైన టూత్ పేస్టుల నుంచి సబ్బులు, కూల్ డ్రింక్స్ వరకు అన్నింటిని ఉత్పత్తి చేస్తోంది. అందుకు అనుగుణంగా మార్కెట్లను విస్తరిస్తోంది. ప్రస్తుతం హిందూస్తాన్ యూనిలీవర్, వెస్లీ, బ్రిటానియా కంపెనీలకు పోటీగా రిలయన్స్ కూడా దిగడం అందరిలో ఆసక్తి కలుగుతోంది. కంపా బ్రాండ్ ముప్పయ్యేళ్ల క్రితమే ఆదరణ పొందినా మధ్యలోనే దాని ప్రభావం అంతగా కనిపించలేదు. అప్పట్లో ఉన్న గోల్డ్ స్పాట్, థమ్సప్, లిమ్కాలతోపాటు కంపా డ్రింక్స్ పోటీ ఉండేది.

దీంతో కంపా డ్రింక్స్ బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో మార్కెటింగ్ వెనుకబడిపోయింది. ఇప్పుడు తాజాగా రిలయన్స్ సంస్థ కొత్తగా వ్యాపార రంగంలోకి తీసుకొచ్చి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ తమ మార్కెట్ల ద్వారా విక్రయించాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కూల్ డ్రింక్స్ రంగంలో మరో సంచలనం కలుగుతుందని తెలుస్తోంది. రోజురోజుకు విస్తరిస్తున్న రిలయన్స్ మరో బాధ్యతను చేపట్టి సక్సెస్ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది.