Manchu Vishnu Injured: డ్యాన్స్ చేస్తూ, గాయపడ్డ మంచు విష్ణు అంటూ ప్రస్తుతం ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. స్టార్ హీరో కాలేకపోయినా మంచు విష్ణుకి ప్రేక్షకులకు ఓ ఇమేజ్ ఉంది. తాను ఇక నుంచి అందరికీ నచ్చే సినిమాలు తీసి అందరిని మెప్పిస్తాను అంటూ ఈ మధ్యే విష్ణు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. కానీ చివరకు ఇలా కాలు విరగకొట్టుకుని వార్తలకు ఎక్కాడు. అసలు విషయంలోకి వెళ్తే.. విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించారు.

ఇది ఇలా ఉండగా తాజాగా మంచు విష్ణు.. జిన్నా మూవీ షూటింగ్ సెట్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో ఓ భారీ స్టెప్ ను విష్ణు వేయాల్సి వచ్చింది అట. ఈ క్రమంలోనే విష్ణు డ్యాన్స్ చేస్తుండగా అతని కాలికి గాయమైంది. పైగా ఈ విషయాన్ని విష్ణునే స్వయంగా తన ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతానికి విష్ణు కి ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది. అయితే, ఈ పోస్ట్ పై నెగిటివ్ కామెంట్స్ రావడం విచిత్రం.
ఏది ఏమైనా మంచు విష్ణుకి అడపా దడపా కొన్ని హిట్లు వచ్చినా అతను స్టార్ కాలేకపోయాడు. ఇక ఐదారేళ్ల నుంచి మంచు విష్ణు నుంచి ఓ మోస్తరు స్థాయి సినిమా కూడా రాలేదు. మొత్తానికి తనకు హీరోగా పెద్దగా కలిసి రాకపోయినా.. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలాగే మరోవైపు నిర్మాతగా ఫుల్ బిజీ కావాలని మంచు విష్ణు ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే విష్ణు అవా (అవ) ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని విష్ణు స్టార్ట్ చేశాడు.
ఈ నిర్మాణ సంస్థలో ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు, లో బడ్జెట్ సినిమాలు చేస్తాడట. అన్నట్టు.. మంచు విష్ణు కేవలం ఓటీటీ కంటెంట్ కోసమే ఈ కంపెనీ పెట్టినట్టు చెప్పాడు. కొత్త నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే మంచు విష్ణు ఈ కంపెనీ స్టార్ట్ చేసాడట. మరి విష్ణు ఎంతమంది కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

అన్నిటికీ మించి మంచు విష్ణు భవనం గురించి కూడా ప్రమాణం చేశాడు. ‘మా’ సంఘానికి చిరకాలంగా వున్న భవన సమస్యకు తాను పరిష్కారం చూపిస్తాను అంటూ ఎన్నికల్లో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. పైగా అప్పుడు విష్ణు ‘మా’ సంఘానికి కట్టబోయే భవనం ఖర్చు మొత్తాన్ని తమ కుటుంబమే భరిస్తుందని కూడా చెప్పాడు. అలాగే భవనం నిర్మాణం కోసం స్థలాలు కూడా చూశానని విష్ణు చెప్పుకొచ్చాడు. మరి ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ? వాటిల్లో దేన్ని ఫైనల్ చేశారు ? లాంటి విషయాలను మాత్రం విష్ణు ఇంతవరకు చెప్పలేదు. పైగా భవనం గురించి కూడా విష్ణు ఏం మాట్లాడటం లేదు.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ