టెలీకాం రంగంలో ఎయిర్ టెల్, జియోల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న పోటీ నేపథ్యంలో టెలీకాం కంపెనీలు కొత్త రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్న జియో యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే కాల్స్ తో పాటు డేటా పొందే అవకాశాన్ని జియో కల్పిస్తూ ఉండటం గమనార్హం.
జియో అందిస్తున్న ప్లాన్లలో ఒకటైన రూ.1,299 రీఛార్జ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల వాలిడిటీని పొందవచ్చు. నెలకు దాదాపు 120 రూపాయలు ఖర్చు చేస్తే 11 నెలల పాటు జియో సేవలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లకు 24జీబీ డేటా, 3600 ఉచిత ఎస్‌ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్ ను పొందవచ్చు. డేటాను ఎక్కువగా వినియోగించని వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 11 నెలల పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జియో వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జియో యొక్క తక్కువ రేట్ రీఛార్జ్ ప్యాకేజీలను పరిశీలిస్తే మరో రెండు ప్లాన్లు సైతం జియో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.329తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాలింగ్, 1,000 ఉచిత ఎస్ఎంఎస్, 6 జిబి డేటాను 84 రోజుల కాలపరిమితితో పొందవచ్చు.
రూ.149తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది. 1,299 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నెలకు 40 రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.