https://oktelugu.com/

ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే.. ఇద్దరు యువ క్రికెటర్లకు చోటు

గత ఐపీఎల్ లో అదరగొట్టిన స్టార్ క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. వీరి ఆటతో మ్యాచ్ లను గెలిపించిన ఈ ఆటగాళ్లకు టీమిండియా తలుపుతట్టింది. వచ్చే మార్చిలో ఇంగ్లండ్ తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కు సూర్యకుమార్, తెవాటియాలను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియం వేదికగా మార్చి 12-20 తేదిల్లో జరిగే ఈ సిరీస్ కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 21, 2021 / 03:32 PM IST
    Follow us on

    గత ఐపీఎల్ లో అదరగొట్టిన స్టార్ క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. వీరి ఆటతో మ్యాచ్ లను గెలిపించిన ఈ ఆటగాళ్లకు టీమిండియా తలుపుతట్టింది.

    వచ్చే మార్చిలో ఇంగ్లండ్ తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కు సూర్యకుమార్, తెవాటియాలను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

    అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియం వేదికగా మార్చి 12-20 తేదిల్లో జరిగే ఈ సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

    ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీకి బలమైన జట్లు రెడీ చేసుకునేందుకు సెలెక్టర్లు ఇంగ్లండ్ సిరీస్ ను ఉపయోగించుకోనున్నారు.

    యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సూర్యకుమార్ యాదవ్, తెవాటియాలను ఇంగ్లండ్ తో సిరీస్ కు ఎంపిక చేశారు.

    ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తోపాటు రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ తెవాటియాలకు భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

    రిషబ్ పంత్ తోపాటు రెండో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. సంజు శాంసన్ పై వేటు పడింది. బ్యాట్స్ మెన్ మనీష్ పాండే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్ లను జట్టు నుంచి తప్పించారు. ఇక కోల్ కతా బౌలర్ వరుణ్ చక్రవర్తికి సెలెక్టర్లు మరో ఛాన్స్ ఇచ్చారు.

    *ఇంగ్లండ్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే..

    విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్‌ కిషన్,భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా,  దీపక్‌ చహర్, నవదీప్ సైనీ, శార్దుల్‌ ఠాకూర్