Golden Tiger: లేత పసుపు, లేత ఎరుపు కలబోత, దానిపై నలుపు చారలు. గంభీరమైన చూపు.. తీ క్షణమైన నడక.. విల్లులా వంగే ఒళ్లు. ఒక్క ఉదుటన గంతులు వేసే కాళ్లు.. పులి గురించి ప్రస్తావనకొస్తే పై విషయాలే గుర్తుకు వస్తాయి. సాధారణంగా ప్రాంతాన్ని బట్టి పులుల రంగులు మారుతూ ఉంటాయి. తెలంగాణలోని అమ్రాబాద్, నల్లమల ప్రాంతాల్లో అయితే కొంత లేత వర్ణంలో, మహారాష్ట్రలో అయితే కొంత ముదురు వర్ణంలో, కేరళ, తమిళనాడు ప్రాంతంలో అయితే ఆకుపచ్చ వర్ణంలో పులులు కనిపిస్తుంటాయి. దట్టమైన అడవిలో తిరుగుతుంటాయి కాబట్టి.. అక్కడి వాతావరణం వాటికి అత్యంత అనువుగా ఉంటుంది కాబట్టి.. వాటి శరీర రంగుల్లో కూడా తేడాలు ఉంటాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో అయితే పులులు తెలుపు రంగులో ఉంటాయి. అమెజాన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నలుపు రంగుతో కూడి ఉన్న పులులు కూడా ఉంటాయి. అయితే పులులు రంగుల్లో తేడాలు ఉన్నప్పటికీ వేటాడే విషయంలో మాత్రం ఒకే విధానాన్ని అనుసరిస్తాయి.
అయితే ఇప్పటివరకు పులులకు సంబంధించి అనేక అధ్యయనాలు జరిగాయి. అయితే ఇంతవరకు బంగారు వర్ణంలో ఉన్న పులి ఆనవాలు ఎక్కడా కనిపించలేదు. అయితే గురువారం జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బంగారు వర్ణంలో ఉన్న ఒక పులి చిత్రాన్ని తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మెజిస్టిక్ బ్యూటీ.. కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన బంగారు పులి కనిపించింది అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా చాలా బాగుందంటూ కితాబిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పులిని తాము చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. బంగారు పులి జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పోస్ట్ చేసిన అస్సాం ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెబుతున్నారు.
అస్సాం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో ఈ బంగారు వర్ణంలో ఉన్న పులి ఇటీవల సంచరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది నిజమో కాదో తెలుసుకునేందుకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ బింద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించారు. దీంతో ఒకసారిగా బంగారు వర్ణపు పులి వెలుగులోకి వచ్చింది. మయూరేష్ బింద్రే ఫొటోలు తీయడం.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా బంగారపు వర్ణపు పులి బయటి ప్రపంచానికి తెలిసింది.. అయితే దీనిపై పర్యావరణవేత్తలు మాట్లాడుతూ బంగారపు వర్ణపు పులి సంచరించడం అరుదైన ఘనత అని, కజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్న జీవవైవిధ్యమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇప్పటివరకు అనేక రంగుల్లో పులలను చూసామని.. జాతీయ పర్యాటక దినోత్సవం రోజు బంగారపు వర్ణంలో ఉన్న పులిని చూడడం మాత్రం ఇదే తొలిసారి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు…మొత్తానికి ఈ బంగారపు వర్ణంలో ఉన్న పులి సామాజిక మాధ్యమాలలో చర్చనీయాశంగా మారింది. అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో.. వేలల్లో లైక్స్ సొంతం చేసుకుంది.
Majestic Beauty!
A rare golden tiger was recently spotted in Kaziranga National Park.#NationalTourismDay pic.twitter.com/UeecZS28FK
— Himanta Biswa Sarma (@himantabiswa) January 25, 2024