Homeఅంతర్జాతీయంSyria : సిరియా కల్లోలం.. దేశం విడిచిపారిపోయిన అధ్యక్షుడు.. విమానం పేల్చివేత?

Syria : సిరియా కల్లోలం.. దేశం విడిచిపారిపోయిన అధ్యక్షుడు.. విమానం పేల్చివేత?

Syria :సిరియాలో సైనిక తిరుగుబాటుతో అల్లర్లు చలరేగాయి. పరిస్థితి అదుపు తప్పింది. అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ రాజధాని డెమాస్కస్‌వైపు దూసుకొచ్చారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధ్యక్ష కార్యాలయం కొట్టేసింది.

తిరుగుబాటుదారులదే పైచేయి..
సిరియా ప్రభుత్వం జరిపిన తిరుగుబాటును అణచివేయడంలో ప్రభుత్వం విషలమైంది. దీంతో తిరుగుబాటుదారులే పైచేయి సాధించారు. శివారు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా రాజధాని శివారుకు చేరుకున్నారు. దక్షిణ సిరియాలోని దారా, స్వీడియా తదితర ప్రాంతాల నుంచి సైన్యం వైదొలిగింది. దీంతో తిరుగుబాటుదారుల వశమయ్యాయి. ఇక డామాస్కస్‌ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా,చ ధరాయాల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయి. 2018 తర్వాత తిరుగుబాటుదారులు రాజధాని శివారుకు చేరుకోవడం ఇదే మొదటిసారి.

తుది దశకు ఆపరేషన్‌..
తిరుగుబాటుదారులు రాజధాని శివారుకు చేరుకన్న నేపథ్యంలో ఆపరేషన్‌ చివరిదశకు చేరుకున్నట్లు ’హయాత్‌ తహరీర్‌ అల్‌ షమ్‌’ (హెచ్‌ఎఎస్‌) నేతృత్వంలోని తిరుగుబాటు దళాల ప్రతినిధి హసన్‌ అబ్దుల్‌ ఘనీ ప్రకటించారు. దక్షిణ సిరియా నుంచి డమాస్కస్‌ వైపు పయనిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సిరియా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు హుమాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అసద్‌ బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

వెయ్యి మంది మృతి..
ఇదిలా ఉంటే సిరియా తిరుగుబాటు నేపథ్యంలో చలరేగిన అల్లర్లలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. హింసాకాండతో 3.7 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. తిరుగుబాటు కారణంగా జైళ్లలో ఉన్న ఖైదీలు విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికా భావిస్తోంది. మరోవైపు రష్యా తిరుగుబాటు దాడులను ఖండించింది.

అధ్యక్షుడి విమానం పేల్చివేత..
ఇదిలా ఉంటే.. సిరియా అధ్యక్షుడు అసద్‌.. విమానంలో పారిపోయాడని తెలుస్తోంది. దీనిని గుర్తించిన తిరుగుబాటుదారులు ఆయన ప్రయాణిస్తున్న విమానం పేల్చివేశారని తెలుస్తోంది. అయితే దీనిని అధ్యక్ష కార్యాలయం ఖండించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version