Akhanda 2 Update : అఖండ బాలయ్య కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం. ఈ చిత్రానికి ముందు వరకు ఆయన చిత్రాల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పది కోట్ల వసూళ్లు కష్టం అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ బడ్జెట్ తో చేసిన ఎన్టీఆర్ బయోపిక్స్ కూడా ఆడలేదు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను ఉచితంగా ప్రదర్శించాల్సి వచ్చింది. ఇక బాలయ్య పని అయిపోయిందని జనాలు ఫిక్స్ అయ్యారు. ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఆ తరుణంలో అఖండ చిత్రం చేశాడు.
బోయపాటి శ్రీనుతో బాలయ్యకు ఇది మూడో చిత్రం. సింహ, లెజెండ్ చిత్రాల రికార్డు కొనసాగిస్తూ.. అఖండ సూపర్ హిట్ కొట్టింది. కోవిడ్ ఆంక్షల అనంతరం థియేటర్స్ కి అఖండ కొత్త కళ తెచ్చింది. రెండు భిన్నమైన పాత్రలు బాలయ్య చేశాడు. అఘోర పాత్రలో బాలకృష్ణ విగ్గులేకుండా కనిపించి సాహసం చేశాడు. ఆఫ్ స్క్రీన్ లో కూడా విగ్గు వదలని బాలయ్య బోయపాటి పై నమ్మకంతో అందుకు ఒప్పుకున్నాడు. అఖండ మూవీలో అఘోర రోల్ బాగా పేలింది.
మొత్తంగా అఖండ బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక వీరి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం అఖండ 2. అధికారిక ప్రకటన జరిగి చాలా కాలం అవుతుంది. బోయపాటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. కాగా నేడు అఖండ 2 చిత్రానికి సంబంధించిన ఫోటో షూట్ లో బాలకృష్ణ పాల్గొంటున్నారట. ఆయనపై లుక్ టెస్ట్ జరుగుతుందట. లుక్ ఫైనల్ చేయనున్నారట. ఇక జనవరి నుండి అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఒక్కసారి మూవీ సెట్స్ పైకి వెళితే బాలకృష్ణ షూటింగ్ పరుగులు పెట్టిస్తారు. ఈ లెక్కన అఖండ 2 దసరా బరిలో దిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి పని చేసే ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న బాలయ్య అవలీలగా వంద కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో అఖండ 2 బడ్జెట్ భారీగానే ఉంటుందట. పార్ట్ 1 తలదన్నేలా సీక్వెల్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది.