Dhamaka Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న మాస్ మహారాజ రవితేజ కెరీర్ కి ఆక్సిజన్ లాగ నిలిచిన చిత్రం ధమాకా..అదిరిపొయ్యే సాంగ్స్ తో విడుదలకు ముందు నుండే మంచి హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..రవితేజ కి ఒక హిట్ పడితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా చేసిన సినిమా ఇది.

డిసెంబర్ 23 వ తారీఖున విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సినిమాలు వచ్చేలోపే 40 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని దాటేసింది..రవితేజ కెరీర్ లో ఇది హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు..విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే నడుస్తుంది..ఒకపక్క ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ సినిమాల మేనియా నడుస్తున్నప్పటికీ కూడా జనాలు ఇంకా ధమాకా మూవీ చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే రవితేజ సినిమాలకు మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే సంక్రాంతి సెలవులలో ఈ చిత్రానికి ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కంటే ఎక్కువ హౌస్ ఫుల్స్ పడ్డాయి..గాజువాక వంటి ప్రాంతాలలో ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి నిన్న హౌస్ ఫుల్స్ లేదు..కానీ ధమాకా చిత్రానికి మాత్రం నాలుగు ఆటలు హౌస్ ఫుల్స్ పడ్డాయి..ఇది సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది..పాతిక రోజుల క్రితం విడుదలైన ఒక సినిమా ఇప్పటికీ కూడా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోవడం అనేది సాధారణమైన విషయం మాత్రం కాదు.

మరో పక్క ఆయన ముఖ్య పాత్ర పోషించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది..ఇలా తాను నటించిన రెండు సినిమాలు ఒక్కే సమయం లో ఆడుతూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్లడం పై రవితేజ తో పాటు ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.