Health Tips: మనలో చాలా మందికి చాయ్ తాగడం అలవాటు ఉంది. దీంతో ఉదయం లేవగానే టీ తాగనిదే దినచర్య ప్రారంభం కాని వారు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చాయ్ కు అందరు ఆకర్షితులయ్యారు. అందులో ఎలాంటి ప్రొటీన్లు లేకున్నా ఉఫశమనం కోసమే టీ తాగుతుంటారు. ఈ అలవాటు ఆంగ్లేయులు చేసింది. కానీ మనం మాత్రం దాన్ని విడిచిపెట్టడం లేదు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక్కొక్కరు కనీసం రెండు నుంచి ఐదు వరకు తాగుతుంటారు. అసలు చాయ్ తాగడం వల్ల ఆకలి మందగిస్తుందని తెలిసినా మానడం లేదు. చాయ్ తాగడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీ తాగుతూ ఏదో ఒక తినుబండారాలు తినడం కూడా చేస్తుంటారు.

చాయ్ తో పాటు సమోసానో లేక పకోడీనో తినాలని చూస్తుంటారు. చాయ్ తో కలిసి కొన్ని ఆహారాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. టీతాగేటప్పుడు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోకూడదు. ఇందులో ఇనుము ఉండటంతో వీటిని చాయ్ తో పాటు తింటే ఇబ్బందులొస్తాయి. టీలో టానిన్లు, ఆక్సలేట్లు ఉండటంతో శరీరంలో ఇనుము శోషణను అడ్డుకుంటాయి. అందుకే కూరగాయలు, ఆకుకూరలు చాయ్ తాగే సమయంలో తినడం అంత మంచిది కాదని తెలుసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే గింజలను కూడా టీతో పాటు తినడం సమంజసం కాదు.
చాయ్ తాగేటప్పుడు లోపలి శరీరం వేడిగా మారుతుంది. దీంతో మనం చల్లని, పచ్చి ఆహారాలను తీసుకోవద్దు. తాజా పండ్లు, ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ క్రీములు, పండ్ల ఆధారిత రసాలు తీసుకోకపోవడమే శ్రేయస్కరం. ఇలాంటివి టీ తాగిన తరువాత తీసుకోవాలి. లేదంటే మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరు శ్రద్ధ వహిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ టీని రెఫర్ చేస్తున్నారు. బ్లాక్ టీలో నిమ్మరసం కలుపుతుంటారు. నిమ్మలో ఆమ్ల స్వభావం ఉంటుంది. దాన్ని ఎప్పుడు టీలో కలపడం సురక్షితం కాదు.

బ్లాక్ టీలో నిమ్మరసం కలపడం ద్వారా ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల కడుపులో అజీర్తి కలగొచ్చు. తరచుగా యాసిడ్ రిఫ్లెక్స్ తో ఇబ్బందులు పడేవారు నిమ్మరసం కలుపుకోకపోవడమే మంచిది. చాయ్ లో పసుపును కూడా కలుపుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. టీలో టానిన్ ఉంటుంది. ఈ రెండింటిని కలపడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. దీంతో పసుపును టీలో కలుపుకోవడం మానుకోవడమే మంచిది. కొందరు చాయ్ తాగుతూ పెరుగు తింటుంటారు. ఇది కూడా సరైంది కాదు. టీలో వేడి ఉంటుంది. పెరుగు చల్లగా ఉంటుంది. వీటిని కలపడం వల్ల నష్టాలుంటాయి. దీంతో టీతో పాటు పెరుగు తీసుకుంటే దుష్ఫలితాలు ఉంటాయి.