https://oktelugu.com/

Veyyinokka Lyrical : ఆమె కోసం ఆగమాగం తిరుగుతున్న రవితేజ.. అసలేమైంది?

Ravi Teja Ravanasura Veyyinokka Lyrical : వెయ్యినొక్క జిల్లాలు తిరిగా నీకోసమే అంటూ మాస్‌ మహారాజా రవితేజ యంగ్‌ బ్యూటీ మేఘా ఆకాశ్‌ వెంట పడుతున్నాడు. రియల్‌ లైఫ్‌లో కాదండి.. రీల్‌ లైఫ్‌లో.. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో అభిషేక నామ, రవితేజ సంయుక్త నిర్మాణంలో రావణసుర అనే సినిమా రూపొందతోంది. ఈ సినిమాకు రామేశ్వర్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 15, 2023 / 10:17 PM IST
    Follow us on

    Ravi Teja Ravanasura Veyyinokka Lyrical : వెయ్యినొక్క జిల్లాలు తిరిగా నీకోసమే అంటూ మాస్‌ మహారాజా రవితేజ యంగ్‌ బ్యూటీ మేఘా ఆకాశ్‌ వెంట పడుతున్నాడు. రియల్‌ లైఫ్‌లో కాదండి.. రీల్‌ లైఫ్‌లో.. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో అభిషేక నామ, రవితేజ సంయుక్త నిర్మాణంలో రావణసుర అనే సినిమా రూపొందతోంది. ఈ సినిమాకు రామేశ్వర్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రెండు పాటలు విడుదలవగా, జనాదరణ పొందాయి. తాజాగా చిత్ర యూనిట్‌ వెయ్యినొక్క జిల్లాల పేరుతో సాగే పాటను బుధవారం సాయంత్రం విడుదల చేసింది.

    ఈ పాటలో రవితేజ మేఘా ఆకాశ్‌ వెంట పడుతున్నట్టు కన్పిస్తోంది. అన్నట్టు ఈ పాట వెంకటేష్‌ హీరోగా సూర్య ఐపీఎస్‌ అనే సినిమాలోది. ఈపాటను సీతారామశాస్త్రి రాయగా, బాలసుబ్రహ్మ ణ్యం పాడారు. ఇళయరాజా స్వరపరిచారు. అప్పట్లో ఈ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ పాటకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో వాడారు. ముఖ్యంగా ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. వింటేజ్‌ లుక్‌ కోసం చాలా కేర్‌ తీసుకున్నారు. రవితేజ, మేఘా ఆకాశ్‌కు నాటి వింటేజ్‌ కాస్ట్యూమ్‌ వాడారు. ఈ పాటలో నృత్యరీతులు కూడా చాలాబాగున్నాయి.

    ఇటీవల టాలీవుడ్‌ నాటి పాటలను రీమేక్‌ చేసే ట్రెండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన కల్యాణ్‌రామ్‌ అమిగోస్‌ సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి గాని అనే బాలకృష్ణ పాటను రీమేక్‌ చేశారు. ఇది జనాదరణ పొందింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు కూడా మైత్రి మూవీ మేకర్స్‌ను అనుసరించారు. వెంకటేష్‌ నటించిన సూర్య ఐపీఎస్‌ చిత్రంలోని వెయ్యిన్నొక్క జిల్లాల పాటను రీమేక్‌ చేశారు. ఈ పాటకు రామేశ్వర్‌ ఫాస్ట్‌ బీట్‌ వాడటంతో వినసొంపుగా ఉంది. ఇటీవల విడుదలయిన రావణసుర టీజర్‌ జనాలను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న రవితేజ పాత్ర అలరిస్తోంది.