Homeజాతీయ వార్తలుTSPSC Paper Leak : నగ్న చిత్రాలు.. బూతు చాటింగ్‌లు: ఈ ప్రవీణ్‌ కేసినో ప్రవీణ్‌నే...

TSPSC Paper Leak : నగ్న చిత్రాలు.. బూతు చాటింగ్‌లు: ఈ ప్రవీణ్‌ కేసినో ప్రవీణ్‌నే మించిపోయాడు

TSPSC Paper Leak  : కేసినో ప్రవీణ్‌ అలియాస్‌ చికోటి ప్రవీణ్‌.. ఆ మధ్య వార్తల్లో నిలిచిన వ్యక్తి.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి కటకటకాలకు వెళ్లిన వ్యక్తి. అతడి వ్యవహారాలను విచారించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. అతడి ఫోన్‌, ల్యాప్‌ టాప్‌, ట్యాబ్‌ పరిశీలిస్తే ఏకంగా ఓ బూత సామ్రాజ్యమే కన్పించింది. వైట్‌ కాలర్‌ కేసుల విషయంలో అవగాహన కల్పించే సమయంలో పోలీసు ఉన్నతాధికారులు ఏకంగా చికోటి ప్రవీణ్‌ ఉదంతాన్ని కేస్‌ స్టడీగా చెబుతున్నారంటే అతగాడి నేరాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పోలీసులకు చిక్కిన ప్రవీణ్‌ వ్యవహారం కూడా చికోటి ప్రవీణ్‌ ఉదంతం లాగే ఉంది.

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. అయితే రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజు మాత్రం పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాడు. ప్రవీణ్‌ సూచన మేరకు అతడు ఇచ్చిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంగా ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసి పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ఇచ్చానని రాజు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రవీణ్‌ సహకరించకపోవడంతో అతని మొబైల్‌ ఫోన్‌, కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లు ఇతర కాంటాక్టులపై దృష్టి సారించారు. ప్రవీణ్‌ మొబైల్‌లో మహిళల నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

2017 నుంచి టీఎ్‌సపీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌ మొదట వెరిఫికేషన్‌ సెక్షన్‌లో పనిచేసేవాడు. నాలుగేళ్లపాటు అక్కడే పనిచేయడంతో వెరిఫికేషన్‌, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళల ఫోన్‌ నంబర్‌లను ప్రవీణ్‌ తీసుకునేవాడు. వారితో కాంటాక్టులో ఉండేవాడు. వాట్సాప్‌ చాటింగ్‌లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకునేవాడు. ఈ మేరకు అతని మొబైల్‌లో చాటింగ్‌లతో పాటు కొందరు మహిళల నగ్న చిత్రాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేణుకతో అయిన పరిచయంతోనే ఏఈ పరీక్షా పత్రాన్ని లీక్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు.

రాజశేఖర్‌రెడ్డి సహాయంతో

9 మంది నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పశ్న పత్రాలు లీకైనట్లు ఆధారాలు లభించాయని, మొత్తం 24 పేజీల ప్రశ్నపత్రాల నకళ్లు లభ్యమయ్యాయి. వీటితోపాటు ఈ నెల 12న నిర్వహించాలనుకున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌పరీక్షకు సంబంధించి 25 పేజీల ప్రశ్నపత్రాలు కూడా లభించాయి. ఏ2 రాజశేఖర్‌రెడ్డి వెల్లడించిన సమాచారం ప్రకారం.. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్‌లక్ష్మి సిస్టమ్‌ రిపేర్‌కు వచ్చింది. దానిని మరమ్మతు చేసేందుకు రాజశేఖర్‌రెడ్డి వెళ్లాడు. అప్పటికే ఆమె నోట్‌బుక్‌ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించిన ప్రవీణ్‌ అక్కడికి చేరుకున్నాడు.

అదే అదునుగా భావించి..

శంకర్‌లక్ష్మి పని నిమిత్తం టీఎస్ పీఎస్సీ కార్యదర్శి రూమ్‌కు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ప్రవీణ్‌.. ఆమె సిస్టమ్‌ నుంచి రాజశేఖర్‌రెడ్డి సహకారంతో ఏఈ ప్రశ్నపత్రాలతోపాటు టౌన్‌ప్లానింగ్‌ ఓవర్సీర్‌ ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేయించి తీసుకున్నాడు. వాటిని ప్రింట్‌ తీసుకున్న ప్రవీణ్‌.. ఈ నెల 2న రేణుకకు వాటిని అందజేశాడు. ఆమె 5 లక్షలిచ్చి ప్రశ్నపత్రాలను తీసుకొని వెళ్లింది. భర్త ఢాక్యాతో కలిసి.. మేడ్చల్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను సంప్రదించి పేపర్‌ అమ్మాలని చూశారు. అతను తన స్నేహితులు నీలేశ్‌, గోపాల్‌లకు సమాచారం ఇచ్చి వాటిని కొనుగోలు చేయించాడు. 14లక్షలకు బేరం కుదుర్చుకున్న నిందితులు నాలుగు లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ప్రవీణ్‌ మొబైల్‌, ల్యాప్‌ టాప్ ను పోలీసులు ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపారు. ఆ రిపోర్టు వస్తే అనేక అంశాలపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version