https://oktelugu.com/

‘Ustad Bhagat Singh”: ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ అనే రూమర్స్ పై స్పందించిన హరీష్ శంకర్.. పవన్ ఫ్యాన్స్ కి పండగే

Harish Shankar ‘Ustad Bhagat Singh’ : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం ఉంటుందని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అయ్యింది.పూజ కార్యక్రమాలు కూడా గత ఏడాది పూర్తి చేసారు,అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దాని మీద నిన్నమొన్నటి వరకు సరిగా క్లారిటీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం చకచకా జరిగిపోతున్నాయి. అన్నపూర్ణ […]

Written By: , Updated On : March 15, 2023 / 10:13 PM IST
Follow us on

Harish Shankar ‘Ustad Bhagat Singh’ : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం ఉంటుందని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అయ్యింది.పూజ కార్యక్రమాలు కూడా గత ఏడాది పూర్తి చేసారు,అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దాని మీద నిన్నమొన్నటి వరకు సరిగా క్లారిటీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం చకచకా జరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ లో రీసెంట్ గానే ఒక భారీ ఇల్లు సెట్ ని కూడా నిర్మించారు,ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా జరగనుంది.ఈ చిత్రం లో ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ ‘తేరి’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం సంచలనం సృష్టించింది.

ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ లో రీమేక్ సినిమాని చూడబోతున్నామా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో బండ బూతులు తిట్టారు.అయితే రీసెంట్ గా హరీష్ శంకర్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో రీమేక్ అంటూ సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలపై హరీష్ శంకర్ ని అడగగా ఆయన దానికి సమాధానం ఇస్తూ ‘సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

అలా ఎవరు ప్రచారం చేసారో కూడా నాకు తెలుసు, అభిమానులకు ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలైన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, అప్పటి వరకు వేచి చూడండి’ అంటూ హరీష్ శంకర్ ఈ సందర్భంగా మాట్లాడాడు.హరీష్ నోటి నుండి ఈ మాట రావడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.మరి షూటింగ్ అంత తొందరగా పూర్తి అవుతుందో లేదో చూడాలి.