https://oktelugu.com/

RaviTeja Khiladi Twitter Review: రవితేజ ఖిలాడి ఎలా ఉంది..? ట్విట్టర్ రివ్యూ

RaviTeja Khiladi Twitter Review: మాస్ మహరాజ్ రవితేజకు పూనకం వస్తే ఎలా ఉంటుందో గత సినిమా ‘క్రాక్’లో చూశాం.. మంచి కథ కథనం దొరకాలే కానీ రెచ్చిపోతాడు. కావాల్సిందల్లా రవితేజను కరెక్ట్ గా వాడుకోవడమే.. 2021లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు అదే ఊపులో ‘ఖిలాడీ’గా మనముందుకు వస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈరోజు (ఫిబ్రవరి 11న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఖిలాడీ మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్ సహా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2022 / 08:40 AM IST
    Follow us on

    RaviTeja Khiladi Twitter Review: మాస్ మహరాజ్ రవితేజకు పూనకం వస్తే ఎలా ఉంటుందో గత సినిమా ‘క్రాక్’లో చూశాం.. మంచి కథ కథనం దొరకాలే కానీ రెచ్చిపోతాడు. కావాల్సిందల్లా రవితేజను కరెక్ట్ గా వాడుకోవడమే.. 2021లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు అదే ఊపులో ‘ఖిలాడీ’గా మనముందుకు వస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈరోజు (ఫిబ్రవరి 11న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

    RaviTeja Khiladi Twitter Review

    ఖిలాడీ మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్ సహా దేశంలో పలు చోట్ల ప్రీమియర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది. అ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? రవితేజకు మరో హిట్ పడిందా? తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంత మేరకు ఆదరించారన్న విషయాలపై ఓ లుక్ వేద్దాం..

    Also Read: తెలుగులో ప్రభాస్ తర్వాత ఆ హీరోతో నటించడం తన డ్రీమ్ అన్న దీపికా పదుకొణే

    ఖిలాడీ మూవీ టీజర్ , ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయడం విశేషం. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందనే వచ్చింది. రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అనసూయ హోంమ్లీ పాత్రలో నటించింది.

    ఖిలాడీ మూవీ చూసిన ప్రేక్షకులు సినిమాపై ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర హైలెట్ అని చెబుతున్నారు. ‘మూవీ అదిరింది.. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్.. మాస్ యాక్షన్ స్టఫ్స్’ అని ఖిలాడీ చూసిన నెటిజన్ స్పందించారు. డైలాగులు, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ అదిరిపోయిందని మరొకరు ట్వీట్ చేశారు. వరలక్ష్మీ,శృతిహాసన్ నటన అద్భుతం అంటూ కొనియాడారు. సినిమా నెక్ట్స్ లెవల్ అని.. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ గా ఇందులో నటించాడని కథను కూడా కొందరు రివీల్ చేశారు.

    https://twitter.com/FanBoy999999/status/1491884901175824384?s=20&t=AxtZClr5kWxl6mUjIqcaVA

    ఇక ఇంకొందరు ఫస్ట్ ఆఫ్ బోరింగ్ అని కామెంట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రం అదిరిపోయిందని.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఆశ్చర్యపరిచిందని సినిమా చూసిన నెటిజన్ కామెంట్ చేశాడు.

    రవితేజ కెరీర్ లోనే ఖిలాడీ ఒక మరుపురాని చిత్రమని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.ఇక డైరెక్టర్ స్క్రిప్ట్ కంటే హీరోయిన్ మీద ఫోకస్ చేశాడని ఇంకొందరు కామెంట్ చేశారు. హీరోయిన్స్ స్టఫ్ రెండు సీన్లు తప్ప సినిమాలో ఏమీలేదని ఇంకొందరు సినిమాపై నెగెటివ్ గా స్పందించారు.

    https://twitter.com/NTR_Cultt/status/1491948620693884928?s=20&t=FVH8uin6lK1_Fu3nA25gqQ

    ఇక ఖిలాడీ మూవీ రవితేజ బ్లాక్ బస్టర్ ఇచ్చిందని.. ఫుల్ మీల్స్ లా ఉందని.. మాస్ మహరాజ్ మరో హిట్ కొట్టాడని కొందరు ఫ్యాన్స్ ట్వీట్ చేశారు.

    https://twitter.com/BhargavDesigns/status/1491948702877257729?s=20&t=l57I0q3JC9o9Qb606z3CFA

    యూఎస్ ప్రీమియర్స్ తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇండియాలో ఫస్ట్ షో తర్వాత ఫుల్ రివ్యూలోనే ఈ సినిమా హిట్టా ఫ్లాపా అన్నది తెలియనుంది. ప్రస్తుతానికి మెజార్టీ పీపుల్ ఈ సినిమా బాగుందని ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్ అదిరిపోయిందని.. హిట్ ఖాయం అని అంటున్నారు.

    https://twitter.com/MoviesFolks/status/1491949255837192194?s=20&t=jjGVDxzlDIIPkUx5jfsgGQ

    Also Read: మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగి ఉంది ఎక్కడో గుర్తించండి?