https://oktelugu.com/

Deepika Padukone: తెలుగులో ప్రభాస్ తర్వాత ఆ హీరోతో నటించడం తన డ్రీమ్ అన్న దీపికా పదుకొణే

Deepika Padukone: సౌత్ నుంచి బాలీవుడ్ కు ఎదిగి 15 ఏళ్లుగా అక్కడ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పడుకొనే తన మనసులోని మాట బయటపెట్టారు. ప్రభాస్ తో కలిసి ప్యాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కే’ చేస్తున్న దీపికా తాజాగా తన కొత్త చిత్రం ‘గెహ్రయాన్’ చిత్రం ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2022 / 10:09 PM IST
    Follow us on

    Deepika Padukone: సౌత్ నుంచి బాలీవుడ్ కు ఎదిగి 15 ఏళ్లుగా అక్కడ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పడుకొనే తన మనసులోని మాట బయటపెట్టారు. ప్రభాస్ తో కలిసి ప్యాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కే’ చేస్తున్న దీపికా తాజాగా తన కొత్త చిత్రం ‘గెహ్రయాన్’ చిత్రం ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు మీడియాలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది.

    ఈ క్రమంలోనే తనకు తెలుగులో ఎవరితో నటించాలనే విషయమై హాట్ కామెంట్స్ చేసింది. తెలుగులో తనకు జూనియర్ ఎన్టీఆర్ తో యాక్ట్ చేసే అవకాశం వస్తే తప్పక నటిస్తానని.. తనకు స్వతహాగా యాక్షన్ మూవీస్ అంటే ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వంటి ఇంక్రిడిబుల్ పర్సనాలిటీ ఎనర్జిక్ నటుడితో ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది.

    మరోవైపు తనకు అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానంటూ దీపిక చెప్పుకొచ్చింది. దీపికా పడుకొనే ప్రస్తుతం దేశంలోనే అగ్రహీరోయిన్ గా ఉన్నారు.ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 64 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మన దేశంలో హీరోయిన్స్ లో 4వ స్థానంలో ఉంది.

    ప్రస్తుతం దీపిక తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి ‘సర్కస్’ మూవీలో నటిస్తోంది. దాంతోపాటు షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘పఠాన్’లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తోంది. రామోజీ పిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.